అర్హులైన జర్నలిస్టులందరికీ ఆక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.!


 

అర్హులైన జర్నలిస్టులందరికీ ఆక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.!

టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమావేశం

సంగారెడ్డి:

సంగారెడ్డి జిల్లా లో నూతనంగా ఏర్పడిన అక్రిడిటేషన్

 కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి ఆరా తీశారు. టీయూడబ్ల్యూజేఐజేయు సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి , ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ లు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో చాలా సంవత్సరాలుగా అర్హులైన వారు జర్నలిస్టులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గ కేంద్రాలలో , మండలాల్లో అర్హులు చాలామంది ఉన్నారని చెప్పారు.వీరందరికీ కూడా సకాలంలో అక్రిడిటేషన్ కార్డులను జారీ చేస్తే బాగుంటుందని వివరించారు. జిల్లాలో ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో , ఉర్దూ , ఇంగ్లీష్ పత్రికలలో అనేకమంది నిత్యం వార్తలు రాస్తున్నారని చెప్పారు. ఇటీవల కాలంలో స్థానికంగా కూడా కొత్త పత్రికలను ఏర్పాటు చేశారని చెప్పారు. కేబుల్ టీవీలలో కూడా అనేక వార్తలు ప్రసారం అవుతున్నాయని అన్నారు. వీడియో గ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లుగా చాలామంది వృత్తికి అంకితమై పని చేస్తున్నారని వివరించారు. జర్నలిజమే ప్రధాన వృత్తిగా స్వీకరించి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం జర్నలిస్టులంతా దరఖాస్తులు చేసుకుంటున్నారని అన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున లభించే గుర్తింపు కార్డుగా అక్రిడిటేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది దరఖాస్తు చేశారు ?ఇంకా ఎంత మంది దరఖాస్తు చేసే అవకాశం ఉన్నది ?అని అడిగారు. జర్నలిజం కోసం అంకితమై పనిచేస్తున్న వారి పేర్లను ప్రతిపాదిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఆమె సూచించారు. సంగారెడ్డి జిల్లా యూనియన్ తరపున తనను ప్రతిపాదించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఎ కే ఫైసల్ లకు బండారు యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కుల కోసం సంక్షేమం కోసం తమ సంఘం నిరంతరం పాటుపడుతుందని ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. డిపిఆర్ఓ విజయలక్ష్మి తో పాటు సభ్యులుగా నియమితులైన యోగానంద రెడ్డి, శ్రీధర్, వై ప్రభాకర్, జి ప్రభాకర్, ఆరిఫ్, అక్రముద్దీన్,మురారి, సిద్ధిక్ అహ్మద్ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్