నల్లగొండ కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు
నల్లగొండ కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు గూఢచారి ప్రత్యేక వార్త నల్లగొండ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా నేతలు జిల్లా కలెక్టరేట్ వద్ద వినతి పత్రం సమర్పించారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూధన్ రెడ్డి నేతృత్వంలో నాయకులు జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్‌ను కలిసి రైతుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై కావాలనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రైతుల వద్ద నిల్వ ఉన్న ప్రతి గింజను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు...