వెల్జల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలలో



🚨 వెల్జల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలలో

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఎం. శరత్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
➡️ ఫిర్యాదుదారుని పని కోసం మొదట రూ.30,000 లంచం డిమాండ్ చేయగా, చర్చల తర్వాత రూ.20,000కు తగ్గించి తీసుకున్నట్లు సమాచారం.
➡️ సైట్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, “నో డ్యూ సర్టిఫికేట్” మరియు “ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్టిఫికేట్” జారీ చేయడానికి లంచం తీసుకున్నాడు.
💰 అధికారులు ఆయన వద్ద నుంచి రూ.20,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
⚖️ నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
📢 లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేయండి:
📞 టోల్ ఫ్రీ: 1064
🔐 ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్