అవినీతి బారిన నిజామాబాద్‌లో ఎస్ఐ … ఏసీబీ వలలో పట్టుబడి అరెస్ట్
అవినీతి బారిన నిజామాబాద్‌లో ఎస్ఐ … ఏసీబీ వలలో పట్టుబడి అరెస్ట్
గూఢచారి ప్రత్యేకం | తేదీ: 06-05-2026
నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ చితన్నోజు భాస్కర చారి ఏసీబీకి చిక్కారు. అధికారిక విధుల్లో సహాయం చేస్తానని చెప్పి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళ్తే, ఫిర్యాదుదారుడి సోదరుడి కుమారుడిని క్రిమినల్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు రూ.10,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ, ఫిర్యాదుదారుడి అభ్యర్థనపై రూ.7,000కి తగ్గించారు. ఈ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు బోధన్ పోలీస్ స్టేషన్‌లో దాడి చేసి పట్టుకున్నారు.
ఎస్ఐ వద్ద నుంచి రూ.7,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.
ఫిర్యాదుదారుడి వివరాలను భద్రత కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
అవినీతి ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగిన పక్షంలో ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106) మరియు సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
(గూఢచారి బ్యూరో)

Comments
Post a Comment