హైడ్రా ప్రజావాణికి 4 వారాల విరామం పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు


 హైడ్రా ప్రజావాణికి 4 వారాల విరామం

పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలికంగా 4 వారాల విరామాన్ని ప్రకటించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇటీవల భారీగా వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

వేలాదిగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను క్లియర్ చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని, ఈ విరామ కాలంలో వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. జూన్ 8వ తేదీ నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అయితే అత్యవసర సమస్యలతో ఉన్న ఫిర్యాదుదారులు కార్యాలయానికి నేరుగా వచ్చి కమిషనర్‌ను కలుసుకోవచ్చని సూచించారు. అలాగే ముఖ్యమైన అంశాలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్