మీడియా ట్రయల్ కంటే న్యాయ విచారణే ముఖ్యం
బండి భగీరథ్ వ్యవహారం: స్నేహం నుంచి కేసుల వరకు… అసలు నిజాలు వెలుగులోకి రావాల్సిందే మీడియా ట్రయల్ కంటే న్యాయ విచారణే ముఖ్యం హైదరాబాద్: కేంద్ర సహాయ మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Bandi Sai Bhagirath పై నమోదైన పోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు, మీడియా మరియు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే కేసు చుట్టూ బయటకు వస్తున్న కొన్ని విషయాలు ఇప్పుడు ప్రజల్లో అనేక సందేహాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం ప్రకారం, భగీరథ్ మరియు ఫిర్యాదు చేసిన యువతి మధ్య పరిచయం ఒక్కరోజులో ఏర్పడినది కాదని తెలుస్తోంది. ఇద్దరూ స్నేహితులుగా తిరిగిన సందర్భాలు ఉన్నాయని, కుటుంబ సభ్యులకు కూడా పరిచయం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఇరువురి కుటుంబాల మధ్య కూడా సాన్నిహిత్యం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బండి భగీరథ్‌ను కేసు పెట్టిన యువతి ఇంటికి రానివ్వడం, కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ ఇవన్నీ నిజమైతే, తరువాత అకస్మాత్తుగా తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు కా...