అరే పొరగాల్లా రా… జర భద్రంగా ఉండండ్రా!

 



అరే పొరగాల్లా రా… జర భద్రంగా ఉండండ్రా!

ఇప్పటి కాలం “ఫ్రెండ్‌షిప్” అన్న మాటతో మొదలై… “కేసు” దగ్గర ముగిసే పరిస్థితులు వస్తున్నయ్‌.

ఒక్క చిన్న తప్పు… ఒక్క అజాగ్రత్త… ఒక్క అర్ధం కాని రిలేషన్… జీవితాంతం మచ్చగా మారుతోంది.

ముఖ్యంగా ఇప్పుడు బయట పడుతున్న కొన్ని కేసులు చూసాక తెలంగాణ పొరగాల్లు గుబులు పడుతున్నరు.

ఎవరు నిజం… ఎవరు తప్పు… అది కోర్టులు తేల్చాల్సిన విషయం.

కానీ ఒక విషయం మాత్రం క్లియర్ —

అవగాహన లేకుండా అడుగు వేస్తే… లైఫ్ మొత్తం జైలు గోడల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తది.

“ఏజ్” అనేది చిన్న విషయం కాదు రా!

“ఆమె ఒప్పుకుంది…”

“మేము ప్రేమించుకున్నాం…”

“ఇద్దరం కలిసి తిరిగాం…”

అన్న మాటలు చట్టం ముందు చాలాసార్లు పనికిరావు.

ముఖ్యంగా మైనర్ విషయంలో అయితే చట్టం చాలా కఠినంగా ఉంటది.

పొరగాల్లు “ఫన్”, “లవ్”, “టైమ్‌పాస్” అనుకుని తిరిగేది… తర్వాత పెద్ద కేసులుగా మారుతున్నయ్‌.

సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్‌లు – ప్రమాదకర మలుపులు

ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్…

వాట్సాప్‌లో చాట్…

బైక్‌పై షికార్లు…

రాత్రి వీడియో కాల్స్…

ఇవి ఇప్పుడు చాలామందికి కామన్ అయిపోయినయ్‌.

కానీ ఎవరి వయసెంత?

ఎవరి ఉద్దేశ్యం ఏంటి?

తర్వాత ఏం జరుగుతది?

అన్న ఆలోచన లేకుండా దూసుకుపోతున్నరు.

ఒక్క కంప్లైంట్ పడితే చాలు…

పోలీసు స్టేషన్, కోర్టులు, మీడియా, సోషల్ అవమానం — అన్నీ వెంటపడతయ్‌.

“మగాడివి కదా ఏం కాదు” అన్న కాలం పోయింది

ఒకప్పుడు చాలామంది “ఏం కాదు రా” అని తీసుకునే విషయాలు…

ఇప్పుడు చట్టాల వల్ల చాలా సీరియస్ అయిపోయినయ్‌.

POCSO లాంటి చట్టాలు వచ్చిన తర్వాత మైనర్ అంశాల్లో అసలు సరదా, ప్రేమ, ఒప్పుకోలు అన్న మాటలకు పెద్ద విలువ ఉండదు.

అందుకే పొరగాల్లా…

ఏజ్ చూసి ఫ్రెండ్‌షిప్ చేయండ్రా!

ఏజ్ చూసింగా చెట్టాపట్టాలు వేసుకుని తిరగండ్రా!

తప్పు మాత్రం చేయకండి.

ఒక్క తప్పు… ఇంటి పరువు నేలమట్టం

కేసు పడితే ఒక్క వ్యక్తి కాదు…

మొత్తం కుటుంబం మానసికంగా చచ్చిపోతది.

తల్లిదండ్రులు బయటకు రావడానికి కూడా భయపడతరు.

సమాజం ముందే నిందితుల్లా చూస్తది.

తర్వాత నిజం బయటకొచ్చినా…

పోయిన పరువు, పోయిన సంవత్సరాలు తిరిగి రావు.

అవగాహన అవసరం… అహంకారం కాదు

ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూసాక యువతలో భయం పెరగడం సహజమే.

కానీ భయంతో కాదు… అవగాహనతో బ్రతకాలి.

చట్టాలు తెలుసుకోవాలి.

లిమిట్స్ తెలుసుకోవాలి.

రిస్క్ ఎక్కడుందో అర్థం చేసుకోవాలి.

గూఢచారి మాట

పొరగాల్లా…రా...

సినిమా డైలాగులు, రీల్స్, ఫ్రెండ్స్ హైప్ చూసి జీవితాన్ని పందెం పెట్టొద్దురా.

ఒక్క క్షణం జోష్ కోసం… జీవితాంతం జైలు గోడలు చూడాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు.

భద్రంగా ఉండండి.

బాధ్యతగా తిరగండి..

తప్పులు చేయకండి.

చట్టం తెలిసి ముందడుగు వేయండి.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్