*"ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్" - అడ్మినిస్ట్రేషన్ ‘వండర్’* *అధికారి ఆవేదన: తప్పు చేయకున్నా శిక్షేనా?* *న్యాయం కోసం కోర్టుకెళ్తానంటున్న డిప్యూటీ తహసీల్దార్*
*"ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్" - అడ్మినిస్ట్రేషన్ ‘వండర్’*
*అధికారి ఆవేదన: తప్పు చేయకున్నా శిక్షేనా?*
*న్యాయం కోసం కోర్టుకెళ్తానంటున్న డిప్యూటీ తహసీల్దార్*
గూఢచారి:* "ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్.. ఇదే అడ్మినిస్ట్రేషన్ వండర్" అంటూ ఓ ప్రభుత్వ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేయకపోయినా, వివరణ ఇచ్చినా సరెండర్ చేయడమేంటని నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ప్రశ్నిస్తున్నారు.
*అసలేం జరిగింది?*
డీటీగా విధులు నిర్వహిస్తున్న రఘునందన్‌కు ఒకరోజు ఉన్నతాధికారి నుంచి పిలుపు వచ్చింది. "ఏమయ్యా.. నీ ఫోన్ ఎందుకు బంద్ ఉంది? ఫోన్ లేప్తలేడు, ఫీల్డ్‌లో లేడు అని ఆ మేడం నీపై ఫిర్యాదు చేసింది. ప్యాడీ సెంటర్లకు పోవడం లేదని కంప్లైంట్ ఇచ్చింది. వెళ్లి సారీ చెప్పి, అటెండెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకో. లేకపోతే ఈ నెల జీతం ఆగుతది" అని హెచ్చరించారు.
దానికి రఘునందన్ "సార్.. నా ఫోన్ డ్యామేజ్ అయ్యింది. రిపేర్‌కు ఇచ్చాను. నేను నౌకరీ చేసేది ఇక్కడ. అక్కడి నుంచి అటెండెన్స్ ఎట్లా తేవాలి?" అని ప్రశ్నించగా, "ఏయ్.. ఎక్కువ మాట్లాడకు.. గెట్ అవుట్. ఆ మేడం ఏసీ గారికి కంప్లైంట్ ఇచ్చింది. పోయి ఆమేడంను కల్సిరా" అని ఉన్నతాధికారి దురుసుగా సమాధానం ఇచ్చారు.
*మేడం దగ్గరకు వెళ్తే..*
దీంతో సంబంధిత మేడం ఆఫీసుకు వెళ్లిన రఘునందన్‌తో ఆమె "ఓ.. డీటీ గారా? మా ఆఫీసుకు రావడం ఇదే మొదటిసారనుకుంటా? ఇప్పుడు కూడా భయపడి వచ్చావ్. నోటీసు రాకపోతే రాకపోయేవాడివి" అని వ్యంగ్యంగా మాట్లాడారు.
దానికి ఆయన "మేడం, నాకు ఫలానా ఆఫీసుకు వెళ్లవద్దని, ఫలానా అధికారిని కలవవద్దని ఏమీ ఉండదు. నేను పర్యవేక్షించాల్సిన ఏరియా ఎక్కువగా ఉండటం మూలంగా ఎక్కువగా రైస్ మిల్లులు తిరగడానికే సమయం సరిపోతుంది. అంతే తప్ప ఆ సార్‌ను కలవద్దు, ఈ మేడం ను కలవద్దు అనే ఇంటెన్షన్ ఉండదు. ప్లీజ్ ఫర్‌గివ్ మీ మేడం. మై సిన్సియర్ అపాలజీ ఫర్ ఎనీ థింగ్ వ్రాంగ్ ఫ్రమ్ మై సైడ్" అని క్షమాపణ కోరారు. దీంతో "సరే.. సరే.. ప్పో.. పొయ్యి.. నీ డ్యూటీ నువు చేసుకో పో" అని ఆమె పంపించేశారు.
*కట్ చేస్తే.. సరెండర్*
అంతా సర్దుకుందనుకున్న సమయంలో ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. "సార్.. మిమ్మల్ని సరెండర్ చేశారు. ఆఫీసుకు వచ్చి కాపీ తీస్కపోండి" అని చెప్పారు.
దీంతో షాక్‌కు గురైన రఘునందన్ "అదేంది? నేను మెమోకు వివరణ కూడా ఇచ్చాను కదా. నా తప్పు ఏమి లేదని చెప్పాను. వివరణ తీసుకున్నాక వారం, పది రోజులు ఆగి ఇప్పుడు ఈ సరెండర్ ఏంది? ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే, నేను ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. కానీ నా తప్పు లేదని మొత్తుకున్నా.. ఇంత చేసినా ఈ సరెండర్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. సార్.. ఇందులో ఏదో కుట్ర ఉంది. కావాలని నన్నే ఇబ్బంది పెడుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
*అసోసియేషన్ ఉంటే భయం*
"అదే ఇతరులను ఇలాగే జస్ట్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయండి. ఓ పది, పదిహేను మంది వచ్చి కూర్చొని మాది ఆ సంఘం, మాది ఈ అసోసియేషన్ అని చెప్పి గట్టిగా కొట్లాడతారు. కనీసం మెమో ఇచ్చే ధైర్యం ఉందా? అన్నంత సీన్ క్రియేట్ చేస్తారు. అధికారుల గుండె ఆగిపోయేలా దడ పుట్టిస్తారు. అమ్మో.. ........ను ముట్టుకుంటే ధర్నా చేస్తారు అనుకునేలా భయపెడతారు. నా వైపు నుంచి తప్పు లేదని మీక్కూడా తెలుసు. ఐనా సరెండర్ చేస్తున్నారు. ఇది అన్యాయం సార్. నేను కోర్టుకు వెళ్తా.. న్యాయం కోసం" అని రఘునందన్ తేల్చి చెప్పారు.
ఫీల్డ్‌లో సిన్సియర్‌గా పనిచేసే అధికారిని ఇలా వేధించడం, వివరణ తీసుకున్న తర్వాత కూడా సరెండర్ చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? సంఘాలు, అసోసియేషన్ల బలం లేని నిజాయితీపరుల పరిస్థితి ఇదేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
*- గూఢచారి ప్రతినిధి*

Comments
Post a Comment