*అంగన్‌వాడీల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల సప్లైలో భారీ కుంభకోణం?*

 



*అంగన్‌వాడీల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల సప్లైలో భారీ కుంభకోణం?*

*హైస్పీడ్ ఫ్యాన్ల టెండర్‌లో 10 లక్షల కుంభకోణం బట్టబయలు* 

*నాసిరకం సామాను సరఫరా: సప్లయర్, అధికారులపై వేటుకు డిమాండ్*

*20 లక్షల టెండర్‌లో 10 లక్షలు స్వాహా?

*సప్లయర్, అధికారులపై విచారణకు డిమాండ్*

*నల్గొండ, గూఢచారి:* చిన్నారులకు ఎండ తాపం తగలకూడదని జిల్లా కలెక్టర్ తలపెట్టిన పుణ్యకార్యంలో దోపిడీ దొంగలు పడ్డారు. డిపార్ట్‌మెంట్ నుంచి బడ్జెట్ రాకున్నా, మినరల్ ఫండ్స్ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మంచి మనసుతో నిర్ణయించానట్లు తెలిసింది.  క్రాంప్టన్ HS Plus  హై స్పీడ్ ఫ్యాన్లు, ఫిలిప్స్ 20 వాట్స్ 3 ఇన్ వన్ ఎల్ఈడీ 4 ఫీట్ల ట్యూబ్‌లైట్లకు టెండర్ పిలిచి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది.

అసలు  కుంభకోణం జరిగింది మాత్రం సప్లైలోనే.  టెండర్‌లో పేర్కొన్న క్రాంప్టన్ HS Plus హై స్పీడ్ ఫ్యాన్లకు బదులు నాసిరకం నార్మల్ సీవిండ్ ఫ్యాన్లు, ఫిలిప్స్ 3 ఇన్ వన్ ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లకు బదులు నార్మల్ ఫిలిప్స్, కొన్నిచోట్ల క్రాంప్టన్ నార్మల్ ట్యూబ్‌లైట్లు అంగన్‌వాడీలకు దర్జాగా దిగుమతి అయ్యాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

దీంతో 20 లక్షల టెండర్‌లో ఏకంగా 10 లక్షలు మింగేశారని, చిన్నారుల పేరుతో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సప్లయర్ దోపిడీకి తెరలేపితే, కొందరు అధికారులు కళ్లు మూసుకుని సహకరించారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

పసిపిల్లల కోసం కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని సైతం సొమ్ము చేసుకునేందుకు వెనుకాడని ఈ ముఠాపై జిల్లా కలెక్టర్ వెంటనే ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన సప్లయర్‌తో పాటు అండగా నిలిచిన అవినీతి అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

*- గూఢచారి ప్రతినిధి*

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్