రేపు హైదరాబాద్‌లో తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్‌పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్తాపత్రికల ప్రదర్శన – 2026
రేపు హైదరాబాద్‌లో తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్‌పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్తాపత్రికల ప్రదర్శన – 2026 చిన్న, మధ్యతరహా పత్రికల ప్రాధాన్యతను చాటనున్న ప్రదర్శన.. ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్‌పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28న (శనివారం) హైదరాబాద్‌లో వార్తాపత్రికల ప్రదర్శన–2026 నిర్వహించనున్నారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ఉదయం 9.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ స్మాల్, మీడియం న్యూస్‌పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు అధ్యక్షత వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్, తెలంగాణ శాసన మండలి విప్ అద్దంకి దయాకర్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్, తెలంగాణ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్ పా...