జైపాల్ రెడ్డి మృతికి సిపిఐ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం


జైపాల్ రెడ్డి మృతికి సిపిఐ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం
ఉత్తమ పార్లమెంటేరియన్ మిర్యాలగూడ మాజీ పార్లమెంట్ సభ్యుడు సూదిని జైపాల్ రెడ్డి మృతికి  సిపిఐ నల్గొండ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్న దని సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లా నరసింహారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండలో విద్యాభ్యాసం చేసాడని మొదటి నుంచి నల్లగొండ జిల్లా తో విడదీయలేని బంధం ఉందని తెలిపారు. రెండు సార్లు మిర్యాలగూడ పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారని అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్ని క అయ్యారని, జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజకీయాల్లో కల్మషం లేని మనిషి గా అందరితో కలిసి మెలిసి ఉండే వారని అన్నారు. జైపాల్ రెడ్డి గారి మృతికి  సిపిఐ నల్లగొండ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం తెలియజేస్తుందని పేర్కొన్నారు.
                      
            


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ