*ఎన్‌కౌంటర్‌: ఐదుగురు మావోయిస్టుల హతం*


"ఎన్‌కౌంటర్‌: ఐదుగురు మావోయిస్టుల హతం


నారాయణపూర్‌ జిల్లా అంబుజ్‌మడ్‌లో ఘటన
రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మరోసారి తుపాకీల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్‌ జిల్లా అంబుజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో  ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలకు వారు ఎదురుపడ్డారు. దీంతో తుపాకుల మోతమోగించారు.
ఈ ఘటనలో  ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని బేస్‌క్యాంపుకి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా తాజా ఎన్‌కౌంటర్‌తో అటవీ ప్రాంతంలో అలజడి మొదలైంది. మరికొంత మంది మావోయిస్టులు దాగిఉన్నారని సమాచారం అందడంతో కూబింగ్‌ను కొనసాగిస్తున్న భద్రతా బలగాలు. ఘటనా స్థలం లో భారీగా ఆయుధాలు, దుస్తువులు, పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్