Skip to main content

**AP మరియు తెలంగాణ కు చెందిన టూర్స్ & ట్రావెల్స్ ఆపరేటర్ లతో సమావేశం నిర్వహించిన మంత్రి   శ్రీనివాస్ గౌడ్**

 AP మరియు తెలంగాణ కు చెందిన టూర్స్ & ట్రావెల్స్ ఆపరేటర్ లతో సమావేశం నిర్వహించిన మంత్రి   శ్రీనివాస్ గౌడ్



హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో  ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు  ఆధ్వర్యంలో పర్యాటక రంగ అభివృద్ధి కి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. బోగస్ టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్ ల కారణంగా రాష్ట్రానికి వచ్చే దేశీయ, విదేశీ  పర్యాటకులకు అసౌకర్యం కలగకుండా నిబంధనలు పై రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  మనోహర్  తో చర్చించారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖలో  గుర్తింపు నమోదు చేసుకోవాలనే విధంగా విధి విధానాలు రూపొందించాలని టూరిజం M D ని ఆదేశించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. 
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తున్న రంగమన్నారు. పర్యాటక రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, పర్యాటకాన్ని సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటక ప్రదేశాలు నిర్లక్ష్యం చేయబడ్డాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.  టూరిజం సర్క్యూట్ లను ఏర్పాటు చేసి  వాటి అభివృద్ధి కి చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా కాళేశ్వరం, లక్నవరం, సోమశిల, బుద్ధవనం, మయూరి ఎకో పార్క్, రామప్ప, పిల్లల మర్రి, మానేరు డ్యామ్, అలంపూర్ లోని జోగులంబా, మల్లెల తీర్థం, మన్ననూరు మొదలైన  పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి  చేస్తున్నామన్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్  అసోసియేషన్ లు రాష్ట్రానికి దేశీయ, విదేశీ పర్యాటకులను  పెద్ద ఎత్తున పర్యాటకులను తీసుకవచ్చేందుకు కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. పర్యాటకులను ఆకర్షించేందుకు, రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను ప్రమోషన్ కు కృషి చేస్తున్న   టూర్ ఆపరేటర్ లకు అవార్డులు, తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ లో అన్ని పర్యాటక ప్రదేశాలకు రవాణా సౌకర్యాలు కల్పించాలని, అందుకు తగిన ప్రచారం కల్పించాలన్నారు మంత్రి.  రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులకు ఆదేశించారు. Ap అండ్ తెలంగాణ కు చెందిన టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్ లతో  త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.
ఈ సమావేశంలో రాష్ట్ర టూరిజం MD మనోహర్, Ap and తెలంగాణ టూర్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ నగేష్, సెక్రెటరీ సాయిబాబా బాదం, టూర్ ఆపరేటర్ హేమంత్ పాండే, సుధీర్ రెడ్డి, రమేష్, విక్రమ్ మరియు తదితర టూర్ ఆపరేటర్ లు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్