**అమరావతి పై రోజుకో మాట మాట్లాడుతున్నారు - చంద్రబాబు**

*అమరావతి*


*తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్*


అమరావతి పై రోజుకో మాట మాట్లాడుతున్నారు


తలోమాట మాట్లాడి రాజధాని ని నాశనం చేస్తున్నారు


రాష్ట్ర భవిష్యత్తు ను అంధకారం లోకి నెడుతున్నారు


ప్రభుత్వ కుట్రలు గమనించాలని 5కోట్ల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా


అమరావతి ఎప్పటికీ ప్రజా రాజాధానే


రాజధాని కి లక్ష కోట్లు కావాలి అంటున్న మంత్రులకు సంపద సృష్టిపై అవగాహన లేదా


కనీస మౌలిక సూత్రాలు కూడా తెలియని విధంగా మాట్లాడుతున్నారు


భూ సమీకరణ వినూత్న ఆలోచన...


*సచివాలయం, కోర్టు ఇక్కడ నడుస్తుండగా పరిపాలన కు కొత్తగా  డబ్బులెందుకు..*


*నిధులు లేవు అని చెప్పటం ఒక సాకు మాత్రమే*


*ఇప్పుడు తరలింపు కోసం అదనంగా డబ్బు ఖర్చుపెట్టాలి కానీ ఉన్న వాటిని వినియోగించుకోటానికి  ఇబ్బందేంటి*


కావాలనే పదే పదే డబ్బులు లేవని మాట్లాడుతున్నారు


నిన్నటి వరకూ ఒకే సామాజిక వర్గం అని మాట్లాడారు


కాదు 75శాతం వెనుకబడినవారున్నారని నిరూపిస్తే వెనక్కి తగ్గారు


తర్వాత ముంపు ప్రాంతమని మాట్లాడారు


అందుకనుగుణంగానే ముంచటానికి అనేక కుట్రలు పన్నారు 


అదీ సాధ్యపడలేదు


అందుకే ఇప్పుడు డబ్బులు లేవని కొత్త రాగం అందుకున్నారు..


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*