Skip to main content

**ముంబయి సివంగి’ ఎన్‌.అంబిక విజయగాథ **

ముంబయి సివంగి' ఎన్‌.అంబిక విజయగాథ 


పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది... పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు... 'నేను ఇంకేం సాధించలేను' అని ఆమె నిరాశపడలేదు... పట్టుదలతో పోరాడి ఐపిఎస్‌ సాధించారు. నార్త్‌ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల 'ముంబయి సివంగి' ఎన్‌.అంబిక విజయగాథ ఇది.


 ''పోలీస్‌ పరేడ్‌కి హాజరు కావాలంటూ ఆ రోజు ఉదయాన్నే నా భర్త ఇంటి నుంచి బయలుదేరారు. ఆ కార్యక్రమం టీవీలో చూశాను. డీజీపీ, ఐజీ హాజరయ్యారు. వారికి పోలీసులు నమస్కరిస్తూ చేసిన గౌరవమర్యాదలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. నా భర్త పోలీస్‌ కానిస్టేబుల్‌. ఆయన ఇంటికి రాగానే అడిగాను- ''డీజీపీ, ఐజీ అంటే ఎవరు'' అని. ''వాళ్లు మా పోలీస్‌ డిపార్టుమెంట్‌లో మొదటి ర్యాంకు అధికారులు'' అంటూ నా భర్త చెప్పారు. అప్పటి వరకూ ఇల్లు, పిల్లలే నా ప్రపంచం. 'అప్పుడే నేను కూడా ఆ స్థాయి అధికారిణి కావాలని నిర్ణయించుకున్నా. అయితే అది అంత సులువు కాదని నాకు తెలుసు'' అంటూ తనలో స్ఫూర్తి నింపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు అంబిక.


 కళ్ళెదుట ఎన్నో అవరోధాలు: తమిళనాడుకు చెందిన అంబికకు 14 ఏళ్ళ వయసులోనే పెళ్లయింది. మేజర్‌ అయ్యేసరికి ఇద్దరు అమ్మాయిలకు (ఐగాన్‌, నిహారిక) తల్లి అయ్యారు. ఇంటి పనులు, పిల్లల ఆలనా పాలనా.. ఇదే ఆమె జీవితం. అలాంటి పరిస్థితుల్లో పోలీస్‌ అధికారి కావాలని నిర్ణయం తీసుకున్నాక ఆలోచించుకుంటే ఆమెకు కళ్ళెదుట అనేక అవరోధాలు కనిపించాయి. హైస్కూల్‌ దాటకుండానే పెళ్ళితో ఆమె చదువుకు ఫుల్‌స్టాప్‌ పడింది. పుస్తకాలకు దూరమై చాలా రోజులయింది. తన కల నెరవేరుతుందో? లేదో? అనే సందేహంలో ఉన్న ఆమెకు భర్త అండగా నిలిచారు. ఆమెతో ప్రైవేటుగా టెన్త్‌ రాయించారు. ఆ తరువత ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసి, సివిల్స్‌ రాసేందుకు అర్హత సంపాదించారు.


 నాలుగో ప్రయత్నంలో విజయం: ఆమె చెన్నైలో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటూ సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. పుస్తకాలు, నోట్స్‌, వార్తాపత్రికలు, మేగజైన్స్‌... ఇవే ప్రపంచం. అయితే మొదటి మూడు ప్రయత్నాల్లోనూ ఆమె విఫలమయ్యారు. అంబిక భర్త ''ఇక ఇంటికి వచ్చెయ్‌'' అన్నారు. ''ఈ ఒక్కసారి ప్రయత్నిస్తా'' అని ఆమె చెప్పారు. మరింత శ్రమించారు. 2008లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. అంబిక ప్రస్తుతం ముంబాయి నార్త్‌ డివిజన్‌ డీసీపీగా నియమితులయ్యారు. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెగువ, దూకుడు చూసి అందరూ ఆమెను 'ముంబాయి సివంగి' అని పిలవడం మొదలెట్టారు. విధి నిర్వహణకు, సేవా తత్పరతకు గుర్తింపుగా 'లోక్‌మత్‌ మహారాష్ట్రియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2019' పురస్కారాన్ని అందుకున్న అంబిక నేటి తరానికి ఆదర్శం.


 


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్