లాక్ డౌన్ అమలు తీరుతెన్నులపై సీపీ పరిశీలన


లాక్ డౌన్ అమలు తీరుతెన్నులపై సీపీ పరిశీలన



 చేవెళ్ల సబ్ డివిజన్ ను సందర్శించిన సైబరాబాద్ సీపీ 
సిబ్బంది ఆరోగ్యంపై ఆరా సూచనలు 
అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు హితవు 
సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని సూచన
లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలి: సైబరాబాద్ సీపీ


సైబరాబాద్: చేవెళ్ల సబ్ డివిజన్ లో అమలవుతున్న లాక్ డౌన్ తీరుతెఎన్నులను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్.,  సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., ఇతర అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 
 - ముందుగా చేవెళ్ల పోలీస్ స్టేషన్ ను సందర్శించి చేవెళ్ల సబ్ డివిజన్ లో చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, చేవెళ్ల ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ, శంకర్పల్లి ఇన్ స్పెక్టర్ గోపినాథ్, షాబాద్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య తదితరులతో కలిసి సిబ్బంది పనితీరు, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
- ముందుగా చేవెళ్ల ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ, శంకర్పల్లి ఇన్ స్పెక్టర్ గోపినాథ్, షాబాద్ ఇన్ స్పెక్టర్ శంకరయ్య లను అడిగి సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తగు విధంగా పరిష్కరిస్తామన్నారు. 
- సిబ్బంది ఆరోగ్యంపై వాకబు చేశారు. సిబ్బంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 
- సిబ్బంది అంతా రెగ్యులర్ గా మెడికల్ చెక్ అప్స్ చేయించుకుంటున్నారా అని తెలుసుకున్నారు. 
- పోలీస్ సిబ్బంది ఇమ్యూనిటీ ని పెంచుకోవాలన్నారు. ఇందుకు సరైన సమయంలో మంచి పోషక ఆహారం తీసుకోవడం తో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలన్నారు. 
- సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా 8 గంటల చొప్పున మూడు షిఫ్ట్ లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటికి వెళ్లగనే సమయాన్ని వృథా చేయకుండా తగు విశ్రాంతి తీసుకోవాలన్నారు.
- సిబ్బందికి అందిస్తున్న ఉసిరి, డ్రై ఫ్రూట్స్, సి- విటమిన్ ట్యాబ్లెట్ లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 
- ద్విచక్ర వాహనం పై బయటకు వెళ్లేటప్పుడు రైడర్ తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ వాడాలన్నారు. 
....................
చేవెళ్ల టౌన్ లో.. 
- చేవెళ్ల టౌన్ లో పర్యటించిన సీపీ గారు మాట్లాడుతూ.. లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన నేపథ్యంలో.. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
- కరోనా కు ఇంతవరకూ సరైన వ్యాక్సిన్ లేదు. నివారణ ఒక్కటే మందు. అందుకే ప్రజలందరూ షాపులు, మార్కెట్, మెడిక షాపులు, బ్యాంకులు, రేషన్ షాపుల వద్ద ఇతర చోట్ల ప్రజలెవరూ గుంపులుగా సంచరించవద్దన్నారు. 
- తప్పనిసరిగా సామాజిక దూరాన్ని/ సోషల్ డిస్టెన్స్ ను పాటించాలన్నారు. మనుషుల మధ్య కనీసం 3 మీటర్ల దూరం పాటించాలన్నారు.  ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిభందన ఉందని ప్రజలు అర్థం చేసుకొని పోలీసులకు సహకరించాలన్నారు. 
- ప్రతీ చిన్న అవసరానికి బయటకు రాకుండా కనీసం రెండు మూడు రోజుల పాటు సరిపోయేలా అన్ని రకాల నిత్యావసరాలను ఒకేసారి కొనుగోలు చేసుకోవాలన్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన వారు మాస్క్ ధరించాలన్నారు. 
-  రోడ్ల మీద ఉమ్మవద్దన్నారు. ఉమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. 
- ప్రజలు ప్రతీ ఒక్కరూ మాస్కులను ధరించాలన్నారు. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఒక శానిటైజర్ ను దగ్గర ఉంచుకోవాలన్నారు. 
- GO: 45, 46 లలో పేర్కొన్న నిబంధనల మేరకు, మోటార్ సైకల్ పై ఒక వ్యక్తి, కార్ లో డ్రైవరు కాక మరొక వ్యక్తికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ మూడు కిలోమీటర్ల పరిధిని దాటినట్లైతే అట్టి వ్యక్తి వాహనాన్ని జప్తు చేసి, వారిపై “జాతీయ విపత్తుల నియంత్రణ చట్టం”, “అంటువ్యాధుల నివారణ చట్టం” మరియు “భారతీయ శిక్షా స్మృతి” మేరకు కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  
- ఇప్పటివరకూ నిభందనలు అతిక్రమించిన 7000 వాహనాలను సీజ్ చేశామన్నారు. అలాగే 3 లక్షలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. 
- నిబంధనలు అతిక్రమించిన వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా పడే అవకాశం ఉంది. జప్తు చేయబడిన వాహనం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం కూడా ఉండదు.  అలాగే భవిష్యత్తు లో ఉద్యోగావకాశాలకు కష్టతరం అవుతుంది మరియు పాస్ పోర్ట్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. 
మొయినాబాద్ లో..
మొయినాబాద్ లోని గండిపేట్ వై జంక్షన్, మొయినాబాద్ విలేజ్ చెక్ పోస్ట్ లను సందర్శించిన సీపీ. సిబ్బంది ని అడిగి పరిస్థితిని తెలుసుకున్న సీపీ.
- లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచన. 
- జంక్ ఫుడ్ తినవద్దు.. మంచి ఆహారం తినాలని సూచన. 
- రాత్రి వేళల్లో డ్యూటీ చేసేవారు రిఫ్లెక్టివ్ జాకెట్స్ వేసుకోవాలన్నారు. 
- హెల్మెట్ ధరించి టూ వీలర్ నడపాలన్నారు. వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. 
సీపీ గారి వెంట సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., మొయినాబాద్ ఇన్ స్పెక్టర్ జానయ్య, ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన