*సాటి వైశ్యుల ఆపదలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు* *- లక్ష్మిశెట్టి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ ఆర్యవైశ్య మహాసభ*


 *సాటి వైశ్యుల ఆపదలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు*  *- లక్ష్మిశెట్టి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్లగొండ ఆర్యవైశ్య మహాసభ*


*నల్లగొండ:* నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టులో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన రెండు ఆర్యవైశ్యుల దుకాణాల బాధితులకు అందించిన సహాయం పట్ల ఆర్యవైశ్య మహాసభ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి _లక్ష్మిశెట్టి శ్రీనివాస్_ కృతజ్ఞతలు తెలిపారు.


"పూర్తిగా దగ్ధమైన దుకాణాలను తిరిగి నూతనంగా ప్రారంభించుకునేందుకు రాష్ట్ర అధ్యక్షులు _అమరవాది లక్ష్మీనారాయణ_ గారి పిలుపుమేరకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు _వనమా వెంకటేశ్వర్లు_ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు _తేలుకుంట చంద్రశేఖర్_, కోశాధికారి _జైని రాములు_, యువజన సంఘం అధ్యక్షులు _గుండా నాగరాజు_ గార్ల సహకారంతో ఆర్థిక సహాయం అందించడం జరిగింది" అని ఆయన తెలిపారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మహిళా, యువజన, మండల స్థాయి నాయకులందరూ విరాళాలు అందించి "సాటి వైశ్యులకు ఆపద వస్తే మేమున్నాం" అని ధైర్యాన్ని ఇచ్చారని పేర్కొన్నారు.


"సహాయం అందించిన ప్రతి ఒక్క వైశ్యునికి ఆ అమ్మవారి దీవెనలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ కుటుంబాలపై ఉండాలని" కోరుకుంటున్నట్లు లక్ష్మిశెట్టి శ్రీనివాస్ అన్నారు.


ఆర్యవైశ్య మహాసభ నల్లగొండ జిల్లా తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. 


_- గుడాచారి.పేజ్_

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన