అగ్రవర్ణ పేదల 10 శాంతం కు రిజర్వేషన్ అమలుకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపిన కేసీఆర్

 


అగ్రవర్ణ పేదల 10 శాంతం కు రిజర్వేషన్

అమలుకు  నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపిన కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన EBCవర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు  ముఖ్యమంత్రి పేదల పక్షపాతి  కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్య్యు.ఎస్.లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇడబ్ల్యుఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. 

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు