PCB రంగారెడ్డి రీజినల్ 1లో ఆర్టీఐ బోర్డ్ పెట్టం.. నిబంధనలు పాటించం.. సమాచారం కూడా ఇవ్వం... చేస్తారో.....కోండి.



PCB రంగారెడ్డి రీజినల్ 1లో 

ఆర్టీఐ బోర్డ్  పెట్టం.. నిబంధనలు పాటించం.. సమాచారం కూడా ఇవ్వం... చేస్తారో.....కోండి.

2005 ఆర్టీఐ యాక్టు వచ్చి 15 ఏండ్లు అయిన  అమలు పరచడములో మరియు  సమాచారం ఇవ్వడంలో, నిబంధనలు అమలు పరచడములో
అధికారులు విఫలం చెందుతున్నారు. అందుకు ఉదాహరణ బేగంపేటలోని  రంగారెడ్డి జిల్లా పర్యావరణ నియంత్రణ రీజినల్ 1 వ కార్యాలయంలో నిబందన ప్రకారం  పిఐవో, apio, అప్పిలేటు అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు వ్రాయించి బోర్డు ఏర్పాటు చేయాలి. దానితో పాటు సెక్షన్ 4 (1)బి ప్రకారం అన్ని 17 annexure లు ఉంచాలి.  కానీ  అధికారులు మాత్రం ఏర్పాటు చేయకుండా  నిర్లక్ష్యం వహించి  చట్ట స్ఫూర్తిని  నీరుగారుస్తున్నారు. మా ప్రతినిధి rti దరఖాస్తు సమర్పించడానికి ఆ కార్యాలయానికి  వెళ్లి ఈ విషయం పై  పిఐవో అడగ్గా అవునండి బోర్డు ఏర్పాటు చేయలేదని బదులు ఇవ్వడం వారికి విధులు పై ఉన్న శ్రద్ధ  ఏ పాటిదో అర్ధం అవుతుంది. అంతేగాకుండా. దరఖాస్తు రుసుము క్రింద నగదు కూడా తీసుకోవచ్చన్న నిభందనను అమలు పరచడం లో  విఫలం అవుతు  దరఖాస్తు దారుల హక్కులను కాల రాస్తున్నారు. 

ఈ ఆఫీసు పై అంతస్తులో ని  ఆఫీస్ లో ఈఈ  నిబంధనల కు విరుద్ధంగా 10 ఏండ్ల గా  అక్కడే   (నిబంధనల ప్రకారం ఒక్క ఆఫీస్ లో  ఉద్యోగిని 3  ఏండ్ల  సర్వీస్ పూర్తి అయితే ఆ ఉద్యోగిని బదిలీ చేయాలి. లేకపోతే  సెక్షన్ మార్చాలి)   తిష్ట వేయడం గుత్తధిపత్యం చేలాయించడం  పై అధికారులు కూడా వారికి వత్తాసు పలకడం  ఎంత వరకు సబబు అని పలువురు విమర్శిస్తున్నారు. అక్కడ pio అయిన ఆ అధికారి  దరఖాస్తు రుసుము నగదు రూపములో తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంగిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలని rti కార్యకర్తలు కోరుతున్నారు

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్