అత్యవసరంగా పల్మోనాలజిస్ట్ ని నియమించండి కలెక్టర్ సారూ - KVPS జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున

 


అత్యవసరంగా పల్మోనాలజిస్ట్ ని నియమించండి కలెక్టర్ సారూ - KVPS జిల్లా  కార్యదర్శి  పాలడుగు నాగార్జున 

              

నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు   అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని. కరోన విలయతాండవం చేస్తున్న పరిస్థితులలో కరోనా వార్డులో రోగులు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారని ఆక్సిజన్,వ్వెంటిలేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ , పల్మనాలజిస్టు  లేకపోవడం వలన మెరుగైన వైద్యం అందించుటకు ఆటంకంగా ఉన్నదని, వెంటనే  నియమించాలనిKVPS జిల్లా  కార్యదర్శి  పాలడుగు నాగార్జున  నల్గొండ జిల్లా కలెక్టరు కు  విజ్ఞప్తి చేశారు. కరోనా రోగులకు అత్యధికంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్య వస్తున్నదని, డాక్టర్ లేకపోవడం వలన బయటకు రెఫర్ చేస్తున్నారని, హైదరాబాదు గాందీకి లేదా ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లడం వలన   ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన తెలిపారు. చివరికి ప్రాణాలు వదిలిన పరిస్థితులు ఉన్నవిని, అదిక ప్రాణనష్టం జరుగనకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*