Skip to main content

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే & బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ ఈటల రాజేందర్




 హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నాంపల్లిలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతన్న ఎమ్మెల్యే & బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు 
ఈటెల రాజేందర్

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈటెల కామెంట్స్:

అకారణంగా, అత్యంత దుర్మార్గంగా సస్పెండ్ చేశారు. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.

మరమనిషి అంటే సొంత అలోచన లేకుండా ఇతరులు చెప్పినట్టు చేసే వారు.

నేను రాజీనామా చేసినప్పుడు కనీసం నా రాజీనామా లేఖ తీసుకోకుండా నన్ను స్పీకర్  అవమాన పరిచారు. 
294 మంది ఎమ్మెల్యేలు, 36 మంది మంత్రులు, 10-12 పార్టీలకు రూమ్ సరిపోయినప్పుడు. ఇప్పుడు రూమ్ కేటాయించకుండా అవమానపరచారు.

గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ఉండదు. ఎందుకు ఉండవు అని అడిగినందుకు మమ్ముల్ని సస్పెండ్ చేశారు. స్పీకర్
మా హక్కులు కాపాడలేక పోయారు.

BAC కి మమ్ముల్ని పిలవలేదు అని స్పీకర్ గారిని అడిగితే ముఖ్యమంత్రి గారిని పోయి అడగమన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి అసెంబ్లీ అజెండా తయారు చేస్తారు. కానీ సీఎం గారు ఏ అంశాలు ఇచ్చారో వాటికే MIM, కాంగ్రెస్ తలవంచి వచ్చారు.

రైతాంగ రుణమాఫీ :
- 3 సంవత్సరాలుగా అకౌంట్స్ NP అయ్యాయి.
- కాంగ్రెస్ కి రైతు సమస్యలు అవసరం లేదా ?
- రైతులను మోసం చేసి, వారి కళ్ళల్లో అధికార పార్టీ మట్టి కొడుతుంటే

VRA : సీఎం మాట ఇచ్చి తప్పే వాడు. చేస్తాడు అనే నమ్మకం ఎవరికి రావడం లేదు. VRO సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, గొల్ల కురుమల సమస్యలు అన్నీ చర్చించాలి. ఆర్టీసీ నిండా ముంచింది కెసిఆర్. ఇవన్నీ చర్చ జరగాలి, అసెంబ్లీ వీటికి పరిష్కారం చూపాలి. సభాపతిగా ప్రజాస్వామ్యం కాపాడాలి. కానీ ఆ పని చెయ్యలేదు.

కెసిఆర్ గారు మీరు క్షమాపణ చెప్పాలి. 
మేము కాదు. ప్రజల పక్షాన నిలబడ్డ మమ్ముల్ని బయటికి పంపించారు.

మరమనిషి అన్నందుకే ఇంత బాధ పడుతున్నారు. కెసిఆర్ ప్రధానిని ఫాసిస్ట్ అన్నారు, దద్దమ్మ, చవట,  బ్రస్టులు, రండ, లఫుట్, సన్యాసి, మతపిచ్చి, కులపిచ్చి గాళ్ళు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఈ భాష గొప్పడట, అది ప్రజల బాషా అని తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారు కెసిఆర్.

సంస్కార హీనుడు, అబద్దాల కోరు కెసిఆర్. దేనినైనా తనకు అనుకూలంగా మలుచుకునే అబద్దాల కోరు కెసిఆర్.

బీసీ బిడ్డగా ఒక గవర్నర్ వస్తె గౌరవించని సంస్కార హీనులు కెసిఆర్, ఆయన పార్టీ.

హెచ్చరిస్తున్నా తాటాకు చప్పుళ్లకు భయపడను ఆనాడే సీఎం ను భయపెట్టిన, చంపుతా అంటే భయపడలేదు. నాకు ఏమన్నా అయితే అగ్ని గుండం అయితది అని చెప్పిన. 
నయీం ముఠా బెదిరింపులకే భయపడలేదు. హుజూరాబాద్ లో పదుల సంఖ్యలో గన్ లైసెన్సులు ఇచ్చి బెదిరింపులకు దిగుతున్నారు. 
నాకు, నా కుటుంబ సభ్యులకు ఒక్క రక్తం బొట్టు చిందిన దానికి భాధ్యత ముఖ్యమంత్రి కెసిఆర్ దే.

ఎన్ని వచ్చినా వెనుకడుగు వెయ్యని వాడిని నేను.

హుజూరాబాద్ లో నిన్ను తిరస్కరించి నన్ను సభాలో ఉండమని చెప్పి పంపారు. కానీ ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

కెసిఆర్ ను ఓడగొట్టే వరకు విశ్రమించను. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ప్రజాభిప్రాయానికి రండి.

సోనియాను ఆనాడు దయ్యం అన్న కెసిఆర్ నే, కాళ్ళు మొక్కారు.
కాంగ్రెస్ పార్టీని కథం చేసిన వారితో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు.

అసెంబ్లీలో ఇంత జరుగుతున్నా కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. మూడు పార్టీలు కూడా బలుక్కొని వచ్చిన  మమ్ముల్ని ఎదుర్కొనే దమ్ము లేదు.

కెసిఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు. కెసిఆర్ నైజం గమనించాల్సింది ప్రజలు
పరిష్కారం, జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ప్రజలు.

నన్ను బయటికి పంపిన తీరు సరిగా లేదు. సభ్యులు సస్పెండ్ అయినా కూడా అసెంబ్లీ అవరణలో ఉండవచ్చు. కానీ నన్ను మీడియా పాయింట్ కి పోనివ్వలేదు. గాంధీ విగ్రహం దగ్గరకి వెళ్లనియ్యలేదు. చివరికి మా పార్టీ ఆఫీస్ కి వెళ్తా అన్నా కూడా వెళ్లనీయకుండా.. ఇటికి తీసుకొని వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేసిన వారు కెసిఆర్, కెసిఆర్ చెప్తే అమలు చేసింది స్పీకర్. కెసిఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. దమ్ములేక, దద్దమ్మలు అయి మమ్ముల్ని బయటికి పంపిచారు.

ఈటల ఉంటే ఫైనాన్స్ మీద మాట్లాడతారు.. సమాధానం మా దగ్గర ఉండదు అని నన్ను బయటికి పంపించారు. గెలిచి సంవత్సర కాలం అయ్యింది అయిన అసెంబ్లీ లోపలికి అడుగుపెట్ట నివ్వడం లేదు.

నా సస్పెన్షన్ పై న్యాయ నిపుణులను సప్రదిస్తున్నం. అన్ని రాష్ట్రాల స్పీకర్ లకు లేఖ రాస్తా.

కేసీఆర్ దుర్మార్గాన్ని ప్రజల ముందు ప్రచారం చేసి కేసీఆర్ ను ఓడగొట్టడమే నా లక్ష్యం.

సభలో పోడియం దగ్గర పడుకున్నాం. ఇలాంటి స్పీకర్, ఇలాంటి సీఎంలే అప్పుడు ఉంటే బెంచ్ ఎక్కేవాల్లం కాదు, గవర్నర్ చైర్ తన్నేవాల్లం కాదు. 
ఆనాడు అవే కేసీఆర్ కి  మంచింగ అనిపించాయి. ఇప్పుడు చక్రవర్తిలా,  రాజులా వ్యవహరిస్తున్నారు.

సభ్యులు నన్ను హేళన చేశారు. తల్లిపాలు తాగి రొమ్ములని గుద్దినవాడు అని అంటున్నారు. రొమ్ము గుద్దిన వాడు కేసీఆర్. బయటికి వెళ్ళగొట్టిందు కేసీఆర్. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది మీరు. మెదడు పని చేస్తుందా ? ద్రోహం చేసింది కేసీఆర్.

అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కి ఉందా ? ఆయన మాట్లాడుతుంటే మీరు బల్లలు కొడుతున్నారు మీకు సిగ్గు ఉందా.. రాజ్యాంగం సాక్షిగా గొంతున్నొక్కుతుంది ఎవరు.

రాజ్యాంగ బద్దంగా ఉన్న గవర్నర్ ను అవమనిస్తుంది ఎవరు. బీసీ బిడ్డ మహిళ అంటే ఇంత చులకనా ?

స్పీకర్ గారికి ఎంత అవమానం జరుగుతుంది నాకు తెలుసు, ఆయన ప్రగతి భవన్ కి వెళితే ఏమన్నారో తెలుసు.

జిల్లా మంత్రి స్పీకర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించిన తీరు అందరూ గమనిస్తున్నారు. ఆయన్ను అనుక్షణం అవమానిస్తున్నారు. అపహస్యం చేస్తున్నారు.

ఈ సమావేశంలో శేఖర్ జీ, తుల ఉమ, జైపాల్ , అశ్వద్ధామ రెడ్డి  పాల్వాయి రజనీ , కేశవరెడ్డి , సునీత రెడ్డి, సంపత్ రావు , ఆంజనేయులు , కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.





Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్