కార్పోరేషన్ కొరకు హరీష్ రావుకు వినతి పత్రం అందచేసిన ఉప్పల శ్రీనివాస్


 *_మంత్రి హరీష్ రావు గారికి వినతి పత్రం అందజేసిన టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త_*



ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి హరీష్ రావుకు హైదరాబాద్ లో సోమవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త వినతి పత్రం అందజేశారు.


*తదనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..* ఆర్యవైశ్యుల్లో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని వారికి ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బృందం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగిందని మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించి సీఎం కెసిఆర్ తో చర్చించి త్వరలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారని తెలిపారు సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యులకు అండగా ఉంటూ ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల భూమిని ఇచ్చి ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తున్న సీఎం కెసిఆర్ ఆర్యవైశ్య కార్పొరేషన్ కచ్చితంగా ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు


*ఈ కార్యక్రమంలో..* ఆయనతోపాటు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్భ చంద్ర శేఖర్,కోశాధికారి కొడిప్యాక నారాయణ,కటకం శ్రీనివాస్,ఐ వీ ఎఫ్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు కట్టా రవి,ఐ వీ ఎఫ్ హైదరాబాద్ ప్రసిడెంట్ వి శ్రీనివాస్, ఐ వీ ఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అయిత నాగరాజు,కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, నంగునూరి సత్యనారాయణ,గోలి సంతోష్,సిద్ది బిక్షపతి,ఎన్ సీ సంతోష్,కైలాస ప్రభాకర్, అంతునూరి శివకుమార్, ఉత్తునూరి సంపత్,నరేష్,వివిధ జిల్లాల ఐ వీ ఎఫ్ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*