*WAM జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు*


 

*WAM జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు*







హైదరాబాదులోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ     గ్లోబల్ కన్వెన్షన్ 2024 గురించి తెలపడానికి  టంగుటూరి రామకృష్ణ   హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా  ఆర్యవైశ్య మహాసభ జాతీయ విభాగము నుండి సేవా కార్యక్రమములో భాగముగా ఈరోజు గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ వద్ద ఒక వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అన్నార్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని భోజన కార్యక్రమం ద్వారా మా సేవలను వినియోగించుకున్నారని ఈ భోజన వసతిని  స్పాన్సర్ చేసిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారు కౌటికె విఠల్  తెలిపారు. ఈ కార్యక్రమానికి  టంగుటూరి రామకృష్ణ  ముఖ్య అతిథిగా పాల్గొని విచ్చేసిన అన్నార్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు రాజశేఖర్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం చైర్మన్  ఊరబాబు రావు, జాతీయ న్యాయ సలహాదారులు అడ్వకేట్ శ్రీ రవి గుప్తా, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ  సీనియర్ సిటిజర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సింగిరికొండ నరసింహ, మరియు ఇతర ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొని సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ