# వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్లో మాజీ అధ్యక్షుడి కి షాక్? ## అవినీతి ఆరోపణలపై క్రిమినల్ చర్యలకు ప్రస్తుత బాడీ సిద్ధం?
# వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్లో మాజీ అధ్యక్షుడి కి షాక్? ## అవినీతి ఆరోపణలపై క్రిమినల్ చర్యలకు ప్రస్తుత బాడీ సిద్ధం? ### ఇటీవల జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సభ్యుల సమాచారం.. గత ఆర్థిక లావాదేవీలపై సమగ్ర పరిశీలనకు యోచన? **గూఢచారి ప్రత్యేక కథనం** వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్లో ఒక మాజీ అధ్యక్షులుగా పనిచేసిన హయాంలో ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలు ఇప్పుడు సంస్థలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గత పాలకవర్గాల హయాంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై ప్రస్తుత పాలకవర్గం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొందరు సభ్యులు అందించిన సమాచారం ప్రకారం, ఇటీవల జరిగిన సమావేశంలో గత వ్యవహారాలపై చర్చించి, ఆరోపణలకు సంబంధించిన రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం బాధ్యులుగా తేలిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. **క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం?** గతంలో సంస్థ బాధ్యతలు నిర్వహించిన కొందరు అధ్యక్షుల హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై పూర్తి వివరాలు సేకరించి, అవసరమైన ఆధారాలు లభిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్...

Comments
Post a Comment