పేద కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అపన్న హస్తం




*పేద కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అపన్న హస్తం*


*ప్రమాదంలో మృతి చెందిన షేక్ నజీర్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం*


*కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ద్వారా కుటుంబానికి అందజేత*


**************************************************

NLG: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మరోసారి మానవత్వం చాటుకున్నారు.ప్రమాదంలో పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించారు.

కనగల్ మండలం ఇస్లాం నగర్ గ్రామానికి చెందిన షేక్ నజీర్ రాయి పనికి వెళ్లి ప్రమాదవశాత్తు రాయి మీద పడి ఈ నెల 24న మృతి చెందాడు.మృతునికి మూగ భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

ఈ విషయం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మంత్రి లక్ష రూపాయలను ఆ కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. దీంతో కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్,మండల యూత్ అధ్యక్షుడు కూసుకుంట్ల రాజిరెడ్డి, చర్లగౌరారం మాజీ సర్పంచ్ వెంకన్న తదితరులు బుధవారం మృతుడు షేక్ నజీర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపించిన రూ.1లక్ష నగదును మృతుని భార్యకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలకరాజు శ్రీను, శ్రీశైలం, దొడ్డి సైదులు, మురళి, ఇస్లాంనగర్ గ్రామ పెద్దలు, ఖాదర్, షబ్బీర్ కాంగ్రెస్ యూత్ నాయకులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు