*CMRF మెడికల్ బిల్లు కోసం రూ.లక్ష లంచం - సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, TSIDC సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో*


 *CMRF మెడికల్ బిల్లు కోసం రూ.లక్ష లంచం - సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, TSIDC సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో*


*హైదరాబాద్, సెప్టెంబర్ 10:* ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మెడికల్ రీయింబర్స్ మెంట్ కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు.


తెలంగాణ సచివాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న *ఆనందేశి రాఘవేందర్ (A-1)* మరియు TSIDC (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) పరిశ్రమ భవన్, బషీర్ బాగ్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న *మేడి వినోద్ (A-2)* లను బుధవారం సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.


*ఏం జరిగింది?*

ఫిర్యాదుదారుడి CMRF మెడికల్ రీయింబర్స్ మెంట్ క్లెయిమ్ ను ప్రాసెస్ చేసి, మంజూరైన రూ.2 లక్షలకు చెక్కు ఇప్పించి, మిగిలిన క్లెయిమ్ ను కూడా ప్రాసెస్ చేసేందుకు A-1 రాఘవేందర్ రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. అంతకు ముందే PhonePe ద్వారా A-2 వినోద్ ద్వారా రూ.5,000 లంచం తీసుకున్నాడు.


ఏసీబీ వల వేయగా ఫిర్యాదుదారుడి నుంచి A-2 వినోద్ రూ.లక్ష తీసుకుని A-1 రాఘవేందర్ కు అందజేశాడు. రాఘవేందర్ వద్ద నుంచి ఆ తడిసిన రూ.లక్ష నోట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ లాభం పొందారని నిర్ధారించిన ఏసీబీ, ఇద్దరినీ అరెస్టు చేసి నాంపల్లిలోని SPE & ACB కేసుల I అదనపు స్పెషల్ జడ్జి ముందు హాజరుపరచనున్నారు. భద్రతా కారణాల వల్ల ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచారు.


*లంచం అడిగితే 1064 కు కాల్ చేయండి*

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ *1064* కు కాల్ చేయాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. వాట్సాప్ 9440446106, ఫేస్ బుక్ (Telangana ACB), X (@TelanganaACB) లో ఫిర్యాదు చేయవచ్చని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ QR కోడ్ అందుబాటులో ఉందని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది.


_- గుడాచారి.పేజ్_

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*