*తెలంగాణ మేర కుల రాష్ట్ర కమిటీ ఎన్నిక*


 

*తెలంగాణ మేర కుల రాష్ట్ర కమిటీ ఎన్నిక*


*హైదరాబాద్, సెప్టెంబర్ 4:* బాగ్‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం నాడు మేర కుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ మేర సంఘం రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కొన్నేళ్లుగా ఎన్నో ఆటంకాలతో పరిష్కారం కాని ఎన్నికల సమస్యను సభ్యుల సహకార, సమన్వయంతో ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగింది.

 అధ్యక్షుడిగా కీర్తి రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా శీలం కోటి రవి, గౌరవ అధ్యక్షులు గా కరాటే కృష్ణ, కోశాధికారిగా సింగు విష్ణు, జాయింట్ సెక్రెటరీ మరియు అధికార ప్రతినిధి గా మునగాల రాము గార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


 తెలంగాణ రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకటరాజం , వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ గార్ల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది.


ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, జోన్లు, పట్టణాల నుంచి మేర సంఘాల మాజీ, ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు, మేధావులు, పెద్దలు పాల్గొన్నారు.

అనంతరం చైర్మన్ సంఘ వెంకట రాజ్యం మాట్లాడుతూ సమన్వయంతో జాతిని ఏకం చేసేవాడే, వివాదాలకు దూరంగా ఉండేవాడే నిజమైన నాయకుడని అన్నారు.

అనంతరం మేర సంగం లో పరిస్కారం కానీ అనేక సమస్యల పై చర్చించడం జరిగింది.

ఉప్పల్ భగాయత్‌లో వివిధ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో మేర ఆత్మగౌరవ భవన నిర్మాణంపైనా, అలాగే వివిధ కుల కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు డైరెక్టర్ల నియామకంపైనా సమావేశంలో చర్చించారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*