*టీజీపీసీబీలో 11 ఏళ్ల సేవలు పూర్తి చేసుకున్న వై. భాస్కర్ చారికి ఘన వీడ్కోలు*
*టీజీపీసీబీలో 11 ఏళ్ల సేవలు పూర్తి చేసుకున్న వై. భాస్కర్ చారికి ఘన వీడ్కోలు*
*హైదరాబాద్, సెప్టెంబర్ 1:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) లో 11 సంవత్సరాల పాటు సెక్యూరిటీ పర్సన్ గా నిబద్ధతతో సేవలందించిన వై. భాస్కర్ చారి పదవీ విరమణ సందర్భంగా సనత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా భాస్కర్ చారి అందించిన సేవలను అధికారులు, ఉద్యోగులు కొనియాడారు. ఆయనను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ అనంతర జీవితం సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (OUSEA) అధ్యక్షుడు సి. మధు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆర్. నవీన్ గౌడ్, రాజా రమేష్, బాబు గౌడ్, రఘు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment