*సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.3.54 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు*
*సూర్యాపేట, సెప్టెంబర్ 3:* ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, కోదాడ మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ టీపీఓ *వుయ్యాల సోమయ్య* పై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది.
నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు బుధవారం ఆయన ఇల్లు, ఆఫీసు, బంధువులు, అనుచరులకు సంబంధించిన మొత్తం 7 చోట్ల సోదాలు నిర్వహించారు.
*సోదాల్లో బయటపడిన ఆస్తులు:*
- సూర్యాపేట జిల్లాలో 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి - విలువ రూ.2,94,000
- సూర్యాపేట, హయత్‌నగర్ పరిధిలో 5 నివాస భవనాలు (G+1, G+2, G+4 + పెంట్ హౌస్, 2 గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు) - విలువ రూ.2,75,00,000
- సూర్యాపేట పరిధిలో 8 ఓపెన్ ప్లాట్లు - విలువ రూ.2,58,500. వీటి మార్కెట్ విలువ ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని అధికారులు తెలిపారు.
- నగదు రూ.4,63,990
- బ్యాంకు బ్యాలెన్స్ రూ.13,00,000
- 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1750 గ్రాముల వెండి ఆభరణాలు - విలువ సుమారు రూ.20,00,000
- 2 ఫోర్ వీలర్లు, 3 టూ వీలర్లు - విలువ రూ.25,20,000
- గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు - విలువ రూ.11,00,000
- అంతేకాకుండా 66.9 తులాల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.49 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నట్లు గుర్తించారు.
మొత్తం ఆస్తుల విలువ *రూ.3,54,36,490* గా ఏసీబీ అంచనా వేసింది. ఇంకా ఇతర ఆస్తులపై ఆరా తీస్తున్నారు.
అవినీతి నిరోధక చట్టం 13(1)(b) r/w 13(2) కింద కేసు నమోదు చేసిన అధికారులు, నిందితుడిని హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ *1064* కు ఫిర్యాదు చేయాలని, వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ (Telangana ACB), X (@TelanganaACB) ద్వారా సంప్రదించవచ్చని ఏసీబీ తెలిపింది.
_- గుడాచారి.పేజ్_



Comments
Post a Comment