మహాసభ రికార్డులు ఇప్పించాలని rti దరఖాస్తు చేసిన భూపతి రాజు & 13 మంది ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ సభ్యులు
మహాసభ రికార్డులు ఇప్పించాలని rti దరఖాస్తు చేసిన భూపతి రాజు & 13 మంది ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ సభ్యులు హైదరాబాద్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బ్యాలెన్స్ కొందరు 3కోట్లు అని, కొందరు 6 కోట్లు అని, ఇంకొందరు 11 కోట్లు ఉండాలి అంటున్న వార్తల మేరకు విషయములో ఏది నిజమో తెలవాలంటే రికార్డులు బహిర్గతం కావాల్సిందేనని ఆర్యవైశ్య జర్నలిస్టు భూపతి రాజు అంటూ సమాచారం కొరకు తాను rti దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. సభ్యత్వ రుసుము లో జిల్లాలకు ఇవ్వవలసిన వాటాలు దాదాపు 11 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదనీ. ఉమ్మడి మహాసభ నుండి పంచుకున్న విద్యానిధి నుండి స్కాలర్షిప్ ఇవ్వలేదని, సేవా కార్యక్రమాలు కూడా చేసిన దాఖలాలు లేవనీ ఆయన అన్నారు, వసూలైన సభ్యత్వం రుసుము భద్రంగా ఉందా, పంచుకున్న నిధులు, విద్యా నిధి నిలువలు ఉన్నాయా? లేక ఖర్చుల క్రింద ఆవిరి అయ్యాయా? అన్న విషయం ఆర్యవైశ్యులకు ముఖ్యంగా సభ్యులకు తెలవలసి ఉందని తెలిపారు. రికార్డులు బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఆర్యవైశ్య నాయకులు 13 మంది కూడా rti దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో మాజీ జిల్లా అధ్య...