*తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త*


 


*తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త*

హైద్రాబాద్: 

తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగుగా, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త  నియమితులయ్యారు. 


ఈ సందర్భంగా క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ నియామకంపై ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఆనందం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 


అలాగే అసోసియేషన్ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం, సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. 


క్రీడా మౌలిక సదుపాయాల పెంపు, శిక్షణా శిబిరాల ఏర్పాటు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తానని పేర్కొన్నారు.


ఇకపై తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, క్రీడా రంగంలో రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప్పల శ్రీనివాస్ గుప్త  స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన