*"ఆవోపా హైదరాబాద్ సర్వసభ్య సమావేశం - నూతన కమిటీ ఎన్నిక"*
*"ఆవోపా హైదరాబాద్ సర్వసభ్య సమావేశం - నూతన కమిటీ ఎన్నిక"* *"మడుపల్లి రవి గుప్తా అధ్యక్షులుగా, ఎస్వీ సంపత్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవం"* *హైదరాబాద్, మే 3:* *"గూఢచారి" న్యూస్ రిపోర్ట్* ఆర్యవైశ్య ఆఫీసర్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) హైదరాబాద్ శాఖ సర్వసభ్య సమావేశం శనివారం ముషీరాబాద్‌లోని వైశ్య హాస్టల్‌లో ఘనంగా జరిగింది. దాదాపు 150 మంది సభ్యులు హాజరైన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. *4 ఏళ్ల లెక్కలు ఆమోదం - 200 కార్యక్రమాలు* సమావేశం ప్రారంభంలో గత నాలుగు సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ అకౌంట్స్‌ను సభ్యుల ముందుంచి ఆమోదం పొందారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రేణికుట్ల నమశివాయ మాట్లాడుతూ, "మా హయాంలో దాదాపు 200 సేవా కార్యక్రమాలు నిర్వహించాం. సభ్యులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం" అని వివరించారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. *నూతన కమిటీ ఎన్నిక - ప్రమాణ స్వీకారం* ప్రస్తుత కమిటీ పదవీకాలం ముగియడంతో, ముందుగానే ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ షెడ్యూల్ ప్రకారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి పి...