వాసవి మాత జయంతి ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


 


నల్లగొండ: గూఢచారి : పట్టణంలోని బీట్ మార్కెట్ రామకోటి స్తూప దేవాలయం మరియు గాంధీ పార్క్‌లో నిర్వహించిన వాసవి మాత జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్గరు పాల్గొని వాసవి మాతను దర్శించుకున్నారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాసవి మాత ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.


ఆర్యవైశ్య సమాజానికి ఎలాంటి సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.


రామకోటి స్తూప దేవాలయ అభివృద్ధికి గతంలో అన్ని విధాలుగా సహకారం అందించినట్లు తెలిపారు. దేవాలయ విస్తరణకు అవసరమైన స్థలాన్ని కూడా సమకూర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.


ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు