Posts

నల్లగొండ కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు

Image
  నల్లగొండ కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు గూఢచారి ప్రత్యేక వార్త నల్లగొండ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా నేతలు జిల్లా కలెక్టరేట్ వద్ద వినతి పత్రం సమర్పించారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూధన్ రెడ్డి నేతృత్వంలో నాయకులు జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్‌ను కలిసి రైతుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై కావాలనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రైతుల వద్ద నిల్వ ఉన్న ప్రతి గింజను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు...

*"డబ్బులు ఇవ్వలేదని సరెండర్ చేశారు - డీఎస్‌ఓపై సీఎస్‌కు డిప్యూటీ తహసీల్దార్ సంచలన ఫిర్యాదు"*

Image
*"డబ్బులు ఇవ్వలేదని సరెండర్ చేశారు - డీఎస్‌ఓపై సీఎస్‌కు డిప్యూటీ తహసీల్దార్ సంచలన ఫిర్యాదు"*   *"సెల్ రిపేర్‌లో ఉంది... ఫోన్ ఎత్తలేదనే నెపంతో వేటు: బాధితుడు మాచన రఘునందన్ ఆవేదన"* "గూఢచారి" క్రైమ్ బ్యూరో*   *నల్లగొండ:* "లంచం ఇవ్వలేదనే అకారణంగా సరెండర్ చేశారు" అంటూ జిల్లా పౌరసరఫరాల అధికారి - డీఎస్‌ఓపై పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సంచలన ఆరోపణలు చేశారు. తన సరెండర్ ఉత్తర్వులు రద్దు చేసి యథావిధిగా విధుల్లో కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. *ఫిర్యాదులో ఏముంది?*   "నా సెల్ ఫోన్ రిపేర్‌లో ఉండటంతో గత నెల 21న డీఎస్‌ఓ ఫోన్ చేస్తే మాట్లాడలేకపోయాను. కానీ 22న నాకు మెమో ఇచ్చారు. నేను మునుగోడు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో విధుల్లో ఉన్నానని వివరణ ఇచ్చాను. అయినప్పటికీ 30న ఆకస్మికంగా నన్ను సరెండర్ చేశారు" అని రఘునందన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. *"చాలాసార్లు డబ్బులు అడిగారు"*   "డీఎస్‌ఓ చాలాసార్లు నన్ను డబ్బులు అడిగారు. నేను ఇవ్వలేనని చెప్పా...

హైడ్రా ప్రజావాణికి 4 వారాల విరామం పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

Image
 హైడ్రా ప్రజావాణికి 4 వారాల విరామం పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలికంగా 4 వారాల విరామాన్ని ప్రకటించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇటీవల భారీగా వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వేలాదిగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను క్లియర్ చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని, ఈ విరామ కాలంలో వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. జూన్ 8వ తేదీ నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే అత్యవసర సమస్యలతో ఉన్న ఫిర్యాదుదారులు కార్యాలయానికి నేరుగా వచ్చి కమిషనర్‌ను కలుసుకోవచ్చని సూచించారు. అలాగే ముఖ్యమైన అంశాలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం కోరిన సీఎం రేవంత్ రెడ్డి – కేంద్ర భాగస్వామ్యం కోరుతూ విజ్ఞప్తి

Image
 హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం కోరిన సీఎం రేవంత్ రెడ్డి – కేంద్ర భాగస్వామ్యం కోరుతూ విజ్ఞప్తి 📍 న్యూ ఢిల్లీ | తేదీ: 06-05-2026, గూఢచారి:  తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం న్యూ ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలుసుకుని హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2 ప్రాజెక్టుకు తక్షణ ఆమోదం ఇవ్వాలని కోరారు. ఫేజ్–2కు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని సీఎం తెలిపారు. ఈ దశలో మొత్తం 7 కారిడార్లతో 122.9 కిలోమీటర్ల పొడవున మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు, దానికి సుమారు ₹38,595 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కావాలంటే కేంద్రం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్‌గా భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలు పెరుగుతున్నాయని, మెట్రో నెట్‌వర్క్ విస్తరణ అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే ఫేజ్–1 ప్రాజెక్టును ఎల్ & టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేస...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 600 ఎకరాల భూమిపై అటవీ శాఖ హక్కు – సుప్రీంకోర్టు తుది తీర్పు

Image
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 600 ఎకరాల భూమిపై అటవీ శాఖ హక్కు – సుప్రీంకోర్టు తుది తీర్పు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివాదాస్పదంగా ఉన్న సుమారు 600 ఎకరాల భూమి అటవీ శాఖకే చెందుతుందని భారత సుప్రీంకోర్టు తుది తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసు కరకగూడెం మండలంలోని కల్వల నాగారం గ్రామం సర్వే నంబర్ 81లో ఉన్న భూమికి సంబంధించినది. ఈ భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌లో చేర్చేందుకు ప్రభుత్వం 1950 ఫిబ్రవరి 6న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిటిషనర్లు ఈ భూమి తమకు నిజాం కాలంలో (1931–33 ఫస్లీ) మంజూరు అయిందని వాదిస్తూ, అటవీ పరిమితుల నుంచి మినహాయింపు కోరారు. అయితే, తమ యాజమాన్యాన్ని నిరూపించే సరైన పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారు. దీనితో, ఖమ్మం జాయింట్ కలెక్టర్ 2003 మే 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ భూమి అధికారిక రికార్డుల్లో “అటవీ భూమి”గా నమోదు అయిందని పేర్కొంటూ వారి అభ్యర్థనను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మొదట సింగిల్ జడ్జి పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, తరువాత డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేస్తూ ప్రభుత్వ వాదనను సమర్థించింది. దీనిపై పిటిషనర్లు స...

అవినీతి బారిన నిజామాబాద్‌లో ఎస్ఐ … ఏసీబీ వలలో పట్టుబడి అరెస్ట్

Image
 అవినీతి బారిన నిజామాబాద్‌లో ఎస్ఐ … ఏసీబీ వలలో పట్టుబడి అరెస్ట్ గూఢచారి ప్రత్యేకం | తేదీ: 06-05-2026 నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ చితన్నోజు భాస్కర చారి ఏసీబీకి చిక్కారు. అధికారిక విధుల్లో సహాయం చేస్తానని చెప్పి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే, ఫిర్యాదుదారుడి సోదరుడి కుమారుడిని క్రిమినల్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు రూ.10,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ, ఫిర్యాదుదారుడి అభ్యర్థనపై రూ.7,000కి తగ్గించారు. ఈ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు బోధన్ పోలీస్ స్టేషన్‌లో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్ఐ వద్ద నుంచి రూ.7,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రత కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. అవినీతి ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగిన పక్షంలో ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచ...

వెల్జల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలలో

Image
🚨 వెల్జల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఎం. శరత్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ➡️ ఫిర్యాదుదారుని పని కోసం మొదట రూ.30,000 లంచం డిమాండ్ చేయగా, చర్చల తర్వాత రూ.20,000కు తగ్గించి తీసుకున్నట్లు సమాచారం. ➡️ సైట్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, “నో డ్యూ సర్టిఫికేట్” మరియు “ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్టిఫికేట్” జారీ చేయడానికి లంచం తీసుకున్నాడు. 💰 అధికారులు ఆయన వద్ద నుంచి రూ.20,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ⚖️ నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 📢 లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేయండి: 📞 టోల్ ఫ్రీ: 1064 🔐 ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.