ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా కౌటికే విఠల్ నియామకం
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా కౌటికే విఠల్ నియామకం హైద్రాబాద్, గూఢచారి డెస్క్: ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా ప్రముఖ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారు, సేవా కార్యక్రమాల నిర్వాహకుడు కౌటికే విఠల్ను సంస్థ గ్లోబల్ చైర్మన్ టీ.జీ. వెంకటేష్ ప్రత్యేక సమావేశంలో నియమించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడిన టీ.జీ. వెంకటేష్, కౌటికే విఠల్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారులలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారని తెలిపారు. తమ పాలసీదారుల జన్మదినోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం వెయ్యిమందికి ఉచిత అన్నదానం నిర్వహించడం, చలికాలంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం, ఎండాకాలంలో వేలాది మందికి ఉచితంగా నీటి బాటిళ్లు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేష గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఇలాంటి సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమాజపట్ల అంకితభావాన్ని గుర్తించి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. అనంతరం కౌటికే...