తిరుపతిలో ప్రారంభమైన అయోధ్య వాసవీ సత్రం

 



తిరుపతిలో ప్రారంభమైన అయోధ్య వాసవీ సత్రం

🔹 రూమ్స్ బుకింగ్ నెంబర్ : 9989 249 679 

🔹 నూతన భవనంలో అధునాతన సౌకర్యాలు

🔹 - ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె


హైదరాబాద్ : శ్రీ అయోధ్య వాసవీ ట్రస్ట్ వారి సత్రం సేవలను తిరుపతిలో ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి, శ్రీ సీతారాములు, తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సత్రానికి శ్రీకారం చుట్టారు.

      ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె మాట్లాడుతూ, తమ సత్రానికి వచ్చే యాత్రికులకు వసతి, భోజన, రవాణా ఏర్పాట్లతో పాటు శుచి, శుభ్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. గత ఏడాదికాలంగా అయోధ్యలో తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికుల మన్ననలను పొందిన తమ సత్రం సేవలను, ప్రస్తుతం తిరుపతికి విస్తరించామని తెలిపారు. మొత్తం 18 పుణ్యక్షేత్రాల్లో సత్రాలు నెలకొల్పి, దక్షిణాది రాష్ట్రాల యాత్రికులకు సేవలు అందేలా ప్రతిపాదనలు చేశామని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు తిరుపతిలో ప్రారంభమైందన్నారు. త్వరలో అరుణాచలం, వారణాసి, నైమిశారణ్యం లలో కూడా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్రాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. తిరుపతిలో అధునాతన సౌకర్యాలతో, విశాలమైన 55 ఏసి గదులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరో రెండు,మూడు నెలల్లో మరో 45 గదులు సిద్ధమవుతాయని హరినాథ్ గుప్త వివరించారు. ఫోన్ నెంబర్ 9989 249 679 ద్వారా గదులు బుక్ చేసుకోవచ్చని ఆయన కోరారు. 

   ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె, అశ్విని దంపతులు పూజాదికాలు నిర్వహించగా, ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేష్ గుప్త, సత్యనారాయణ గుప్త దంపతులు, విజయ్ మహేష్, నగేష్ కుమార్, వెంకటసుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్