మెఘా’ కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు!!!????
'మెఘా' కృష్ణారెడ్డి
ఇల్లు, కార్యాలయాలపై
ఐటీ దాడులు!!!????
మెఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత సన్నిహితుడు, అతికొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని… భారతీయ సంపన్నుల్లోనే మొదటి 100స్థానాల్లో నిలిచిన మెఘా సంస్థ కార్యాలయాలపై ఐటీ దృష్టిపెట్టింది. ఇంత త్వరగా ఇన్ని వేల కోట్ల రూపాయాల సంపాదన ఎలా సాధ్యమయింది… ఎక్కడెక్కడ మెఘా సంస్థ పనులు చేస్తోంది, ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్టుల వివరాలు… సంపాదించిన మొత్తంపై పూర్తి లెక్కలు రాబడుతోంది.
తొలివెలుగుకు వచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం 35చోట్ల మెఘా సంస్థ కార్యాలయాలు, కృష్ణారెడ్డి ఆఫీసు, ఇళ్లతో పాటు ఆయన బంధువులు, కీలక అనుచరుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధంలేని ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
బినామీ కంపెనీల వివరాలు, పన్ను ఎగవేత అంశాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భారీగా ఫేక్ బిల్లులతో పాటు ప్రభుత్వ అధికారుల వద్ద ఉండాల్సిన ఆయా ప్రాజెక్టుల కీలక అంశాలు ఈ సోదాల్లో లభ్యమయినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న మెఘా సంస్థ కార్యాలయాలపై ఎకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. మెఘా సంస్థ తెలంగాణలో 80వేల కోట్లకు పైగా బడ్జేట్‌తో నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, ఆంద్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇక తెలంగాణలో మరో కీలక ప్రాజెక్ట్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో కూడా అంచనాల పెంపు మెఘా కంపెనీ కోసమే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవలే ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, కొనుగోలులో మెఘా కృష్ణారెడ్డి, మెఘా సంస్థపై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ నుండి వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కోట్ల రూపాయల డబ్బులు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి.వీటిపై కూడా ఐటి శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
Comments
Post a Comment