Skip to main content

**స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000?**

 స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000?


కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించేందుకు సిద్ధమౌతోంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ద్వారా లబ్దిదారులకు రెట్టింపు పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. నెలవారి పెన్షన్ మొత్తాన్ని రూ.10,000కు పెంచాలని యోచిస్తోంది. ఇదేజరిగితే లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ద్వారా అందించే పెన్షన్ మొత్తం పెంపు ప్రతిపాదనలపై చర్చిస్తోంది.. అసంఘటిత రంగంలోని వారికి ప్రయోజనం చేకూరేలా తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ప్రముఖ జాతీయ మీడియా ఎకనమిక్ టైమ్స్‌ ఈ విషయాలు వెల్లడించింది. మోదీ సర్కార్ కేవలం పెన్షన్ పెంపునకు మాత్రమే పరిమితం కాకుండా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ వయసు పరిమితిని కూడా పెంచాలని యోచిస్తోంది.ప్రస్తుతం ఈ పెన్షన్ పథకంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న వారు చేరొచ్చు. వయసు పరిమితిని 50 ఏళ్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. 'అటల్ పెన్షన్ స్కీమ్ వయసు పరిమితిని, పెన్షన్ డబ్బులను పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశాం. అలాగే కేంద్రానికి దీనికి సంబంధించిన అన్ని వివరాలు అందించాం' అని పీఎఫ్‌ఆర్‌డీఏ మెంబర్ (ఫైనాన్స్) సుప్రతిం బంధోపాధ్య తెలిపారు.


అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరితే 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. నెలకు చెల్లించాల్సిన చందా మొత్తం వయసు, పెన్షన్ మొత్తం ప్రాతిపదికన మారుతుంది. మీరు 18 ఏళ్ల వయసులో స్కీమ్‌లో చేరితే రూ.1,000 పెన్షన్ కోసం రూ.42 చెల్లించాలి. అదే రూ.2,000 పెన్షన్‌కు రూ.84, రూ.3,000 పెన్షన్‌కు రూ.126, రూ.4,000 పెన్షన్‌కు రూ.168, రూ.5,000 పెన్షన్‌కు రూ.210 కట్టాలి.


అదే మీరు 39 ఏళ్ల వయసులో పథకంలో చేరితే రూ.1,000 పెన్షన్ కోసం రూ.264, రూ.5,000 పెన్షన్ కోసం రూ.1,318 చెల్లించాలి. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరాలంటే భారతీయ పౌరులు అయ్యి ఉండాలి. కనీసం 20 ఏళ్లపాటు చందా కొనసాగించాలి. ఆధార్‌లో లింకైన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి.


మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. బ్యాంకులు ఈ స్కీమ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకుకు వెళ్లి అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) స్కీమ్‌లో చేరొచ్చు. మీకు పథకంలో చేరిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్