ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?
ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?
హైదరాబాద్: మహాసభలో అక్రమాలు జరుగుతున్నాయని, జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించడం లేదని, సభ్యత్వ రుసుముల వసూళ్లలో దొంగ రసీదు బుక్కుల వ్యవహారం ఉందని ప్రక్షాళన కమిటీ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
“తస్మాత్ జాగ్రత్త” అంటూ ప్రక్షాళన కమిటీ చేసిన ఆరోపణలపై మహాసభ సంజాయిషీ నోటీసు జారీ చేయడం, ప్రక్షాళన కమిటీ లేవనెత్తిన అంశాలు అధికారికంగా స్పందించాల్సిన స్థాయికి చేరుకున్నాయనే సంకేతంగా భావించవచ్చు.
అయితే అసలు ప్రశ్న ఇప్పుడు మొదలైంది.
సంజాయిషీ నోటీసుతోనే వ్యవహారాన్ని ముగిస్తారా?
లేక ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలను బయటపెడతారా?
ముఖ్యంగా సంబంధిత జిల్లా కమిటీని రద్దు చేస్తారా? లేక కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? అన్నది ఇప్పుడు సామాన్య ఆర్యవైశ్యుడిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జిల్లా కమిటీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? ఆరోపణలు నిరాధారమని తేలితే దానిని అధికారికంగా ప్రకటిస్తారా? సభ్యత్వ రుసుముల వసూళ్లు, రసీదు బుక్కుల వ్యవహారంపై పూర్తి లెక్కలు, రికార్డులు బయటపెడతారా?
ఇప్పటికే “పొరపాటు జరిగింది” అంటూ బాధ్యులుగా పేర్కొన్నవారు బహిరంగంగా ప్రకటించిన విషయాలు కూడా చర్చకు వచ్చాయి. పొరపాటు జరిగిందని అంగీకరించడం ఒక అంశమైతే, ఆ పొరపాటుకు బాధ్యత ఎవరిది? దానికి పరిష్కారం ఏమిటి? అనేది మరో కీలక ప్రశ్న.
ఇప్పుడు సామాన్య ఆర్యవైశ్యుడి చూపు మహాసభ తదుపరి చర్యలపైనే ఉంది.
జిల్లా కమిటీ రద్దు అవుతుందా?
లేక వార్నింగ్‌తో సరిపెడతారా?
బాధ్యులపై చర్యలు ఉంటాయా?
లేక సంజాయిషీ నోటీసుతోనే కథ ముగుస్తుందా?
ప్రక్షాళన కమిటీ లేవనెత్తిన అంశాలపై నిజానిజాలు వెలుగులోకి రావాలంటే పారదర్శక విచారణ, స్పష్టమైన నిర్ణయం, బాధ్యత నిర్ధారణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రక్షాళన కమిటీ నాయకులు శ్యాంసుందర్ మా ప్రతినిధితో మాట్లాడుతూ దొంగ రసీదు తో వసూలు చేసిన సొమ్ము అమరవాదికే చెల్లించినట్లు బాధ్యులు చెపుతున్నారని మరి ఈ విషయంలో అమరవాది కూడా బాధ్యుడు అవుతారని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనీ, వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక నిర్ణయం ఎవరిది?
చర్యలు ఏంటి?
జిల్లా కమిటీ భవిష్యత్తు ఏమిటి?
ఏం జరగబోతోందో… వేచి చూద్దాం!

Comments
Post a Comment