నల్లగొండ నారాయణ స్కూల్‌లో విద్యార్థిపై దాడి అమానుషం: బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు


 

నల్లగొండ నారాయణ స్కూల్‌లో విద్యార్థిపై దాడి అమానుషం: బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు

నల్లగొండ: నల్లగొండలోని నారాయణ స్కూల్‌లో ఒకటో తరగతి విద్యార్థిపై జరిగిన దాడి అత్యంత అమానుషమని బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులపై దాడులు చేయడం నారాయణ స్కూల్‌లో పరిపాటిగా మారిందని ఆరోపించారు. బ్రాండ్ పేరుతో విద్యను వ్యాపారంగా మార్చి, అర్హత లేని వ్యక్తులను అధ్యాపకులుగా నియమిస్తున్నారని, తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల కొనుగోలులోనూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు.

ఒకటో తరగతి విద్యార్థిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్న ఆయన, ఈ ఘటనపై సంబంధిత అధికారుల ద్వారా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే, నారాయణ స్కూల్‌కు సంబంధించిన అనుమతులను తక్షణమే సమీక్షించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే పర్మిషన్లు రద్దు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ప్రైవేట్ పాఠశాల చట్టబద్ధ అనుమతులు, నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఐతరాజు సిద్దు డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన