**రూ. లక్షతో గుట్టుగా బైక్‌ కొన్న బాలుడు వ్యక్తి మృతికి కారణం ×*

రూ. లక్షతో గుట్టుగా బైక్‌ కొన్న బాలుడువ్యక్తి మృతికి కారణం కావడంతో విషయం రట్టు



బేగంపేట (అమీర్‌పేట), న్యూస్‌టుడే: ఓ బాలుడు ఇంట్లో తెలియకుండా సుమారు రూ. లక్ష విలువైన ద్విచక్ర వాహనం కొన్నాడు. దాన్ని నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. దీంతో విషయం బయటికొచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాసరావు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నాచారం సమీపంలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన బాలుడు (17) తన సోదరుడు (19)తో కలిసి బేగంపేటలోని ఓ షోరూంలో సెప్టెంబరు 30న ద్విచక్ర వాహనాన్ని కొన్నాడు. దాని విలువ సుమారు రూ. లక్ష. హాస్టల్లో ఉంటున్న బాలుడు బైకును తన వద్దనే ఉంచుకున్నాడు. వారం కిందట అతడు బైక్‌ నడుపుతుండగా ఘట్‌కేసర్‌ సమీపంలో ఒక వ్యక్తిని ఢీకొట్టి అతడి మృతికి కారణమయ్యాడు.
దీంతో బాలుడి కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. అతడి తండ్రి, బంధువులు శనివారం వాహన షోరూంకు వచ్చి బైక్‌ ఎందుకు విక్రయించారని నిలదీశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అక్కడికి వెళ్లిన తమపైనా బాలుడి బంధువులు దురుసుగా ప్రవర్తించారని కానిస్టేబుళ్లు కూడా ఫిర్యాదు ఇచ్చారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*