***గవర్నర్‌ను కలిసిన రాజధాని రైతులు.**

*అమరావతి*


*గవర్నర్‌ను కలిసిన రాజధాని రైతులు.*


*అమరావతి రైతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను గురువారం కలిశారు.*


రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిపత్రం సమర్పించారు. 


*తొమ్మిది రోజులుగా రాజధానిలో జరుగుతున్న పరిణామాలను ఈ సందర్భంగా రైతులు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాడు ప్రభుత్వం అడిగితే అందరమూ భూములు ఇచ్చామని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.*


రాజధాని అమరావతిలోనే ఉండేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరినట్లు వారు తెలిపారు. అయితే గవర్నర్ ఈ విషయాలపై సానుకూలంగానే స్పందిచినట్లు రైతులు తెలిపారు.


*175 మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఆనాడు అమరావతిని రాజధానిగా అంగీకరించారని, జగన్ కూడా ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పినట్లు వారు గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా రాజధానిని తరలిస్తామని ప్రకటించడం అన్యాయమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.*


అమరావతిలోనే రాజధాని ఉంచాలని, లేకుండా తమ జీవితాలు రోడ్ల పాలవుతాయని అన్నారు


*మా బాధను అర్థం చేసుకొని అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు*


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్