**మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ. సైదాబాబు సస్పెన్షన్**

*మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ. సైదాబాబు సస్పెన్షన్*


- - అవినీతి ఆరోపణలపై విచారణ చేసి సస్పెన్షన్ కు సిఫార్సు చేసిన ఎస్పీ రంగనాధ్
- - 15 రోజుల సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు


నల్గొండ : పలు అవినీతి ఆరోపణలు, పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం లాంటి ఆరోపణలపై మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ. సైదాబాబును హైదరాబాద్ రేంజ్ డిఐజి సస్పెండ్ చేశారు.


మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకుండా వ్యవహరించడం, దర్యాప్తులు సక్రమంగా చేయకపోవడం, రోడ్డు ప్రమాదాల ఘటనలోనూ కేసులు నమోదు చేయకుండా అక్రమాలకు పాల్పడడం లాంటి అవినీతి ఆరోపణల క్రమంలో ఆయనను సస్పెండ్ చేశారు.


అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఎస్.ఐ..సైదాబాబు సెల్ ఫోన్ కాల్ డేటా తో పాటు గత 15 రోజులుగా సమగ్రంగా విచారణ జరిపిన జిల్లా ఎస్పీ సస్పెన్షన్ కు సిఫార్సు చేయడంతో హైదరాబాద్ రేంజ్ డిఐజి శివశంకర్ రెడ్డి మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ. సైదాబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్