**అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కీచక పర్వం**

కుత్బుల్లాపూర్‌: నగర శివారులోని ఇంజనీరింగ్‌ కాలేజీలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కీచక పర్వానికి తెరలేపాడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన సదరు ప్రొఫెసర్‌ ఓ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వెంకటయ్య ల్యాబ్‌కు పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు కరీంనగర్‌లో ఉన్న తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*