Skip to main content

Posts

Showing posts from 2020

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కలిసిన చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు.

  తెలంగాణ రాష్ష్ట్ర  ప్రణాళికా సంఘం   ఉపాధ్యక్షులు  శ్రబోయినపల్లి  వినోద్ కుమార్  గారిని  కలిసిన చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు.  తెలంగాణ స్మాల్ మీడియం  న్యూస్ పేపర్స్ మరియు  మ్యాగజైన్స్ అసోసియేషన్   అధ్యక్షులు  యూసుఫ్ బాబు  గారి ఆధ్వర్యంలో   నేడు అనగాతేదీ  31.12. 2020 న బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో గల   మినిస్టర్స్  క్వార్టర్స్  నందు  బోయనపల్లి   వినోద్ కుమార్  గారిని వారి   నివాసంలో   కలిసి  చిన్న పత్రికల సమస్యల పై వివరించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నెల ప్రకటనలు లేక  రాక  చిన్న పత్రికలు  మనుగడ కోల్పోయే ప్రమాదం ఉందని ,  కావున   చిన్న పత్రికల కు  ప్రతినెలా ప్రకటనలు విడుదల చేసి ఆదుకునేలా మా సమస్యను  సీఎం గారి దృష్టి కి తీసుకెళ్లాల్సిందిగా  కోరడం జరిగింది.  అన్ని విషయాలు వినోద్ కుమార్ గారికి వివరంగావివరించగా  సానుకూలంగా స్పందిస్తూ సమాచార శాఖ కమిషనర్ తో మాట్లాడిన తర్వాత  సీఎం దృష్టి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు  యూసఫ్ బాబు ,డిప్యూటీ ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ , ఉపాధ్యక్షులు అగస్టీన్ , రాష్ట్ర నాయకులు  బి.వెంకటయ్య జూన్ షహీద్ ,అఫ్రోజ్,ఖాసిం  తదితర పత్రికా సంప

కాళేశ్వ‌రం పై శ్వేత పత్రం విడుదల చేయాలి - ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌

కాళేశ్వ‌రం పై శ్వేత పత్రం విడుదల చేయాలి - ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌  కాళేశ్వ‌రం నీటి పారుద‌ల ప్రాజెక్టు  పార‌ద‌ర్శ‌క‌త, జ‌వాబుదారీత‌నం లేక అవినీతి జ‌రుగుతుందని  శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయ‌మ‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌  వారు  గ‌వ‌ర్న‌ర్ గారికి విన‌తి ప‌త్రం ఇచ్చారు.

చిన్న పత్రికలకు ప్రకటనలివ్వండి మంత్రి కేటీఆర్ కు వినతి

  చిన్న పత్రికలకు ప్రకటనలివ్వండి మంత్రి కేటీఆర్ కు  వినతి చిన్న పత్రికలకు ప్రకటనలిచ్చి ఆదుకోవాలని రాష్ట్ర పురపాలక, ఐటి పరిశ్రమ ల శాఖ మంత్రి కేటిఆర్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లు చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు తెలిపారు. సోమవారం దేశోద్ధారక భవన్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  సురవరం ప్రతాప రెడ్డి 125 వ జయంతి ఉత్సవాల లోగో ఆవిష్కరించేందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర  ఐటీ శాఖ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావును  కలిసి చిన్న పత్రికలకు ప్రతినెల  విడుదల చేసే ప్రకటనలు విడుదల చేసి, దినపత్రికలను కాపాడాలని   కోరామన్నారు. అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారికి మన సమస్యలను వివరించామని, సీఎం దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు  అగస్టీన్, కోశాధికారి  ఆజoఖాన్, రాష్ట్ర నాయకులు, వెంకటయ్య   యూసుఫ్ ఉద్దీన్,   ఇక్బాల్, అఫ్రోజ్ ఖురేషి,  రియాసత్,  ఖాదిర్ ,ఫారూఖి, వాజీద్ మసూద్ తదితర పత్రికా సంపాదకులు పాల్గొన్నారు.  

మోడీ తీసుకొచ్చిన Ews రిజెర్వేషన్ అమలు చేస్తాం, *100 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

*మోడీ తీసుకొచ్చిన Ews  రిజెర్వేషన్ అమలు చేస్తాం, *100 కోట్లతో ఆర్యవైశ్య  కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం  - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 10 శాతం రిజర్వేషన్లు, ఆర్యవైశ్య  కార్పొరేషన్   ఏర్పాటుకు కేసీఆర్ కు భగవంతుడు సద్బుద్ధి కల్పించాలని కరీంనగర్ లో ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు బుస్సా  శ్రీనివాస్   ఆధ్వర్యంలో సకృత్ చండి మహా యాగం నిర్వహించారు. ఈ  దీక్ష కార్యక్రమానికి  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ కేసీఆర్ వెంటనే మోడీ తీసుక వచ్చిన  10శాతం రిజర్వేషన్లు,  ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  ఆయన  విఫలం అయితే  2023 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే  రిజెర్వేషన్లు అమలు చేస్తామని, 100 కోట్ల తో ఆర్యవైశ్య కార్పొరేషన్  ఏర్పాటు చేస్తామని  తెలిపారు.   కుల సంఘాల నాయకులు కులాల కొరకు పనిచేయకుండా,  కులాల అభివృద్ధికి కృషి చేయాలనే విషయాన్ని  మరిచి పోయి  కేసీఆర్ మోచేతి నీళ్లు త్రాగుతూన్నారని  విమర్శించారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి,   ఐక్య వేదిక  ప్రధాన కార్యదర్శి పడకంటి రమేష్, రామేశం,  కార్యాచరణ కమిట

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం- రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి

  రైతుల ఆదాయం  రెట్టింపు చేయడమే కేంద్ర  ప్రభుత్వ లక్ష్యం- రాష్ట్ర  బీజేపీ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి జయంతి సూపారిపాలన దినోత్సవం సందర్బంగా ఒక్క క్లిక్ తో దేశంలో  9  కోట్ల రైతులకు 18 వెల  కోట్ల  రూపాయలు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద  రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్బంగా  ప్రధాన మంత్రి నేరుగా 2 కోట్ల  మంది రైతులతో వ్యవసాయ చట్టాల పై వర్చువల్లో  ముఖ ముఖ లో పాల్గొన్న  కార్యక్రమాన్ని  బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక్ష  ప్రస్సారం చేశారు.ఈ కార్యక్రమానికి  విచ్చేసిన రాష్ట్ర బీజేపీ కార్య దర్శి  ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ   రైతుల  ఆదాయం రెట్టింపు చేయడమే  ప్రధాన మంత్రి మోడీ లక్ష్యమని, దేశంలో వ్యవసాయంలో సమృద్ధి సాధించడం, రైతులకు మేలు చేయడానికి ఈ చట్టల ఉద్దేశ్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా మాజీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు పల్లెబోయిన శ్యామసుందర్, నూకల వెంకట నారాయణ రెడ్డి,  జిల్లా కోశాధికారి విద్యాసాగర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సీతారాంరెడ్డి, , పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వ

ఉప్పల పౌండేషన్ తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓ బృహత్తర కార్యక్రమం

  తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఉప్పల పౌండేషన్ తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఓ బృహత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లక్ష్మి అనే దివ్యాంగురాలికి, సూర్యనారాయణ అనే కంటి చూపులేని వ్యక్తి వివాహానికి శ్రీమతి ఉప్పల స్వప్న  బంగారు పుస్తెలు, వెండి మెట్టెలు ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. కుల మత ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉప్పల ఫౌండేషన్ సేవలు నేడు దివ్యాంగులకు సైతం అందడం పట్ల ఫౌండేషన్ ను సర్వత్రా అభినందిస్తున్నారు.

చిన్న పత్రికలకు అన్ని విధాలా సహకరిస్తా - ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

  చిన్న పత్రికలకు అన్ని విధాలా సహకరిస్తా - ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండలో జరిగిన తెలంగాణ స్మాల్ అండ్ మీడియం  అసోసియేషన్ నల్గొండ జిల్లా సమావేశంలో నల్గొండ శాసన సభ్యులు  కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ  చిన్న మరియు మధ్యతరహా పత్రికలకు అన్ని విధాలా సహకరించి ఆదుకుంటామని తెలిపారు. అరుహులైన చిన్న పత్రికల  వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని, ఇంటి స్థలం ఉన్న వారికి  ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్ధిక సహకారం  ఇప్పస్తామని తెలిపారు. నల్గొండ నియోజవర్గాన్ని ముఖ్యన్గా నల్గొండ  పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ  సందర్బంగా శాసన సభ్యులు భూపాల్ రెడ్డికి, నల్గొండ మునిసిపల్ ఛైర్మెన్ సైదిరెడ్డి గార్లకు  చిన్న పత్రికల తరపున ఘనంగా  సన్మానం చేశారు.  ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ మాట్లాడుతూ చిన్న పేపర్లకు ప్రకటనల కొరకు నిరాహారదీక్ష కు సిద్ధమని, అవసరమైతే నాగార్జున సాగర్ ఎన్నికల్లో అందరం నామునేషన్లు వేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర  twju రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్,  భాస్కర్, యాతకుల లింగయ్య, జిల్లా  జర్నలిస్టుల సంఘ ప్రధాన కార్యదర్శి గుండగొని జ

మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం

  మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం సోమవారం 14న నల్గొండలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం నల్గొండ  పట్టణ ప్రజలచే నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు గంగడి మనోహర్ రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి,  మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఒరుగంటి రాములు, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, నూకల నరసింహ రెడ్డి, శ్రీ రామోజు షణ్ముఖ, బండారు ప్రసాద్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, నూకల  వెంకట నారాయణ రెడ్డి లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే నని భారీ సంఖ్యలో హాజరై  విజయవంతం చేయగలరని కోరారు.

ఎన్నికలకోసం డ్రామాలు సాగవ్ - ఉపేందర్

ఎన్నికలకోసం డ్రామాలు సాగవ్ - ఉపేందర్  తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం 10%  ఆర్థికంగా వెనుకబడిన వాటికి రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రా ప్రభుత్వం అమలు చేయక ఎందరో విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఉపేందర్ ఆరోపించారు   వైశ్య కార్పొరేషన్ అని ప్రకటించి అమలు చేయలేదు రెడ్డి  వైశ్య ఇంకా కురుమ కొన్ని b c కులాలకు స్థలాలు ప్రకటించి అమలు పరుచలేదు   బీసీ sc st కులలో ఎందరో విద్యార్థులు నిరుద్యోగులు గా మారి రోజు వారికూలీలు గా మారుతున్నారు మున్సిపల్ ఉద్యోగులకు జీతాలు పెంచడం సంతోషం కానీ వారు శుభ్రత లొ పరిశుభ్రతలో ముందు ఉండి కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడివారికి కంటి తుడుపుగా ప్రకటించడం శోచనీయం  వరదల్లో కొట్టుకొని పోయినవారికి ఇంటికి 10వేలు ప్రకటించి తెరాస కార్యకర్తలకు ఇవ్వడం మిగతా ప్రజానీకాన్ని బాధపెట్టడం బాధాకరం   10వేలు కాకుండా 50వేలు ఇచ్చి వరదల్లో నష్ట పోయిన అన్ని కుటుంబాలను ఆదుకోవాలి  డిసెంబర్ 4 ghmc ఎన్నికలో తెరాస ఓడిపోతుందని గ్రహించి వరాలు పదవులు ప్రకటించి  ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జర్గుతున్నాయి  మేధావులు నిరుద్యోగులు వ్యాపారాలు కర్షకులు ఉద్యోగులు అందర

దుబ్బాక దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం ఆర్యవైశ్య నాయకులకేనా లబ్ది? పేద ఆర్యవైశ్యులకు లబ్ది చేకూర్చరా? కార్పొరేషన్ ఏమైంది? 10 శాతం రిజర్వేషన్ సంగతి ఏంటి??

దుబ్బాక దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం ఆర్యవైశ్య  నాయకులకేనా లబ్ది? పేద ఆర్యవైశ్యులకు  లబ్ది  చేకూర్చరా? కార్పొరేషన్ ఏమైంది? 10 శాతం రిజర్వేషన్ సంగతి ఏంటి? దుబ్బాక ఎన్నికల్లో ఆర్యవైశ్యులు తమ సత్తా  చాటడంతో   జిహెచ్ఎంసి ఎన్నికలో  ఆర్యవైశ్యులు ఎక్కడ దూరం అవుతారనో అని  ఆర్యవైశ్యు లకు  మూడు పెద్ద పెదవులే ఇచ్చారు. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామమే ఆయినప్పటికి  పేద  వైశ్యులకు ఏమి దక్కిందని పలువురు ఆర్యవైశ్య నాయకులు పెదవి విరుస్తున్నారు.  ముగ్గురు నాయకులకు పదవులు లిస్తే  అది వారి ఎదుగుదలకే ఉపయోగపడుతుందని ,  పేద ఆర్యవైశ్యులు ఏమి లాభం జరగదని అంటున్నారు వైశ్యులు.  అధికార పార్టీలో చక్రం తిప్ప గలిగే అగ్రనాయకులు పదవులు ఇప్పించుకోవడంలో విజయం సాధించారని ఇది  ఆర్య వైశ్య జాతి ఎంతో సంతోషించ విషయమే అయినప్పటికీ సామాన్య తరగతి ఆర్యవైశ్యులకు లాభం జరిగే లాగా ఈ సమయంలోనే అధికార  పార్టీ ప్రకటించిన కార్పొరేషన్ కూడా సాధించి లాభం చేకూర్చాలని అభిప్రాయ పడుతున్నారు. ఇదే కాకుండా పేద  ఆర్యవైశ్యులకు  విద్య, ఉద్యోగాల్లో లాభం జరగాలంటే మోడీ ప్రకటించిన 10 శాతం అగ్రవర్ణ రిజర్వేషన్ అమలు పరిచేలా వత్తిడి తేవాలని, ఇదే మంచి సమయమని ఆ దిశగా

కొండ వెంకట ప్రసాద్ కు వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున తెలిపిన అభినందనలు

  కొండ వెంకట ప్రసాద్ కు వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున తెలిపిన  అభినందనలు కరోనా కష్టకాలంలో మార్చి నుంచి ఆరు నెలలుగా వింజమూరు మండలం లో లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న కొన్ని వందల మంది పేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ కరోనా కష్టకాలంలో ఆర్యవైశ్యుల  ఆరోగ్యం బాగుండాలని , ' ఆరోగ్యమే మహాభాగ్యం ' గా ఉండాలని  వారికి ఉన్నటువంటి పరిచయాలతో కరోనా పరీక్షలు ప్రతి ఒక్కరిని  చేయించుకోమని చెబుతూ, కరోనా వచ్చిన వ్యక్తులు యొక్క ఆరోగ్య మరియు యోగక్షేమములు కనుక్కుంటూ విశిష్ట సేవలు అందిస్తున్నటు  వంటి కొండా గరుడయ్యా రామచంద్రయ్య వెంకటసుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ , వింజమూర్, ఫౌండర్  కొండా వెంకట ప్రసాద్ గారికి వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. కొండా బ్రదర్స్ హైదరాబాదులో ఉన్నప్పటికీ వారికి మన వింజమూరు మీద ఎనలేని ప్రేమ అభిమానం కలిగి ఉండడం మన అదృష్టం. చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అభినందనలు..

ఆన్ లైన్లో వ్యభి చార దందా

ఆన్ లైన్లో వ్యభి చార దందా చిలకలూరిపేటకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన తెలంగాణ రాచకొండ పోలీసులు అన్ లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ బ పట్టుకున్నారు.  నిర్వాహకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడమేగాక పశ్చిమ్ బంగ , కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు . పరారీలో ఉన్న అంజలి ( ప్రధాన నిర్వాహకురాలు ) , ఆమె సహాయ కుడు చిన్నా కోసం గాలిస్తున్నారు. *గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వంశీరెడ్డి* తో విజయవాడకు చెందిన అంజలి , చిన్నా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అంతకుముందే వీరికి వివిధ రాష్ట్రాల్లో యువ తులను సరఫరా చేసే దళారులతో పరిచయముంది. వారి సహకారంతో కొంత డబ్బు చెల్లించి పశ్చిమ్ బంగా, కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులను నగరానికి తీసు కొచ్చి బల్కంపేటలోని అద్దె ఇంట్లో ఉంచారు. సామాజిక మాధ్యమాలు , లొకాంటో తదితర వెబ్ సైట్లలో ఈ నలుగురి ఫొటోలను ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు.  నమ్మకం కుదిరాకే మళ్లీ ఫోన్    ఈ వ్యవహారమంతా ఆన్ లైన్ లోనే జరుగుతోంది . విటుల నుంచి ఫోన్ రాగానే నిర్వాహ కులు అప్రమత్తమవు తారు. మీకు ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ తీసి మళ్లీ ఫోన

భారత్‌ కోలుకుంటోంది

భారత్‌ కోలుకుంటోంది. భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఈ వైరస్‌ కోరల్లోంచి బయటపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడో రోజూ కరోనాను జయించిన వారి సంఖ్య 24గంటల్లో మరో రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే 34,602 మంది రోగులు కోలుకోవడంతో దేశంలో రికవరీ రేటు 63.45శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది._  _ఈ రోజు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం దేశంలో  ఈ ఒక్కరోజే అత్యధికంగా 49,310 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో  మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,87,945కి పెరిగింది. వీరిలో 8,17,209 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..  30,601 మంది ప్రాణాలు కోల్పోయారు.  దేశంలో మరణాల రేటు కూడా 2.38శతానికి పడిపోవడం విశేషం. ప్రస్తుతం 4,40,135 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కరోనా పరీక్షలను పెంచి పాజిటివిటీ రేటు తగ్గిస్తామని ప్రకటించిన కేంద్రం అందుకనుగుణంగా టెస్టుల సంఖ్యను పెంచుతోంది. దేశవ్యాప్తంగా 1290 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 3,52,801 శాంపిల్స్‌ పరీక్షించారు. దేశంలో నిన్నటి వరకు 1,54,28,170 శాంపిల్స్‌ను పర

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. చాంద్రాయణగుట్ట police la వేధింపులు తట్టుకోలేక చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్  పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన పాత నెరస్థుడు షబ్బీర్..... షబ్బీర్ ని కాపాడేందుకు యత్నించిన చాంద్రాయణగుట్ట అదనపు సిఐ ప్రసాద్ వర్మ తోటి సిబ్బంది.. క్రైమ్ డి ఐ ప్రసాద్ వర్మ తో పాటు మరో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలు....  కాలిన గాయాలతో నెరస్థుడు షబ్బీర్ ని ఆసుపత్రికి తరలించిన చాంద్రాయణగుట్ట పోలీసులు.... షబ్బీర్ గతం లో 4 కేసులు పై శిక్ష అనుభవించాడు.... విచారణ నిమిత్తం తాజాగా ఓ దొంగతనం కేసులో పిలిపించి చాంద్రాయణగుట్ట పోలీసులు... సెల్ ఫోన్ దొంగతనం కేసు విచారణ నిమిత్తం షబ్బీర్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచిన పోలీసులు

ఎస్సారెస్పీ కాలువకు గండి

సూర్యాపేట జిల్లా..పన్ పహడ్ మండలం ధర్మాపురం గ్రామంలో  ఎస్సారెస్పీ కాలువకు గండి భారిగా వృథా అవుతున్న గోదావరి జలాలు.  ఇసుక బస్తాలతో గండి ని పూడ్చి వేస్తున్న అధికారులు.. పరిస్థితిని పరిశీలిస్తున్న పెన్ పహాడ్ ఎంపిపి.

దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.

  దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ. 11 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన మూడు రోజుల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసుల నిర్ధారణ. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 40, 425 పాజిటివ్ కేసులు నమోదు కాగా 681 మంది మృతి.  దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 11, 18, 043 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 3, 90, 459 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 7, 00, 087 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 27, 497 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 22, 664 మంది బాధితులు.

ఏ సి బి దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :పాల్వంచ మండలం  కిన్నెరసాని విఆర్వో పై ఏసీబీ దాడులు ఏడు వేల రూపాయల నగదు స్వాధీనం కొనసాగుతున్న విచారణ.

జూన్ 11 ఏపీ కరోనా సమాచారం

ఏపీ కరోనా బులిటెన్ అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 135 కేసులు నమోదవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 38 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే విదేశాల నుంచి వచ్చి 9 మందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఏపీలో 182 పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ఏపీకి చెందిన 11,602 శాంపిళ్లను పరిశీలించగా 135 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా 65 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఏపీలో నమోదైన మొత్తం 4261 పాజిటివ్ కేసులకు గాను.. 2540 మంది డిశ్చార్జ్ అవగా.. 80 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1641 మంది కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు.

జూన్ 10 తెలంగాణ కరోనా సమాచారం

జూన్ 10 తెలంగాణ కరోనా సమాచారం క్రొత్త పాజిటివ్ కేసులు 191 ఈ రోజు మృతి చెందినవారు 8 మొత్తం కేసులు 4111 అక్టీవ్ కేసులు 2138 డిశ్చార్జ్ అయినవారు 1817 మృతి చెందినవారు 156

జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు అందిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు.రెండు నెలల వ్యవధిలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయనున్నట్లు  ఆయన వెల్లడించారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు.ఏజెన్సీల నిర్లక్ష్యంతో మిగితా పనులలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడమే తక్షణ కర్తవ్యమని ఆయన తెలిపారు.మిషన్ భగీరథ పురోగతి పై బుధవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ 40,123 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం చరిత్రాత్మక మైనదన్నారు.ఏడు దశాబ్దాల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పటి పాలకులు  త్రాగు నీటి మీద 590 కోట్ల

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మూడు జిల్లాల్లో పర్యటన

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం  పరిశీలించేందుకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌  మూడు జిల్లాల్లో పర్యటన తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ముందుగా కామారెడ్డికి చేరుకోనున్నారు. జిల్లాలోని రెండు గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. అనంతరం అక్కడి నుండి సంగారెడ్డి జిల్లాకు, ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లాకు వెళతారు. ఆయా జిల్లాల్లోనూ రెండేసి గ్రామాల్లో పనులు జరుగుతున్న విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ప్రతి నెలా ప్రభుత్వం రూ .308 కోట్లను జిపిలకు విడుదల చేస్తోంది. పర్యటన సందర్భంగా పారిశుధ్యం, డంప్ యార్డులు, శ్మశానవాటిక, నర్సరీ, టికెహెచ్‌హెచ్‌పై సిఎస్ దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ ఈ పర్యటన చేపట్టారు. గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే పల్లె ప్రగతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

జూన్ 4 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణా కరోనా బులిటిన్ విడుదల ఇవాళ 127 పాజిటివ్ కేసులు నమోదు ఇవాళ 6 గురు మృతి ఇప్పటి వరకు 105 మంది మృతి తెలంగాణ లో మొత్తం 3147 కేసులు నమోదు ఇవాళ జిహెచ్ఎంసీ లో 110 కేసులు రాష్ట్రంలో 1455 అక్టీవ్ కేసులు

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు-భారీగా చోరీ సొత్తు స్వాధీనం

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు-భారీగా చోరీ సొత్తు స్వాధీనం తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను గురువారం సి.సి.ఎస్ మరియు ఖాజీపేట పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. పోలీసులు అరెస్టు చేసిన దొంగ నుండి సూమారు 30లక్షల విలువగల 475 గ్రాముల బంగారు, 3 కి.లోల వెండి అభరణాలతో పాటు, 2లక్షల 50వేల నగదు, 5ఎల్.ఈ.డీ టివిలు, 4ల్యాప్ ట్యా న్లు , ఒక ప్రింటర్, 2 సెల్ ఫోన్లు, 6కెమెరాలు, ఒక ట్యాబ్, ఒక డిజిటల్ వాచ్ ఖరీదైన చలువ అద్దాలతో పాటు ఒక గ్యాస్ సిలెండర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పూర్తి వివరాలు: సయ్యద్ ఆలాఫ్ ఆలియాస్ అఫ్రోజ్, తండ్రి పేరు భక్షి, వయస్సు 37, నివాసం నవపేట గ్రామం, మండలం చీరాల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు సయ్యద్ అల్తాఫ్ బాల్యం నుండే చిల్లర చోరీలకు పాల్పడటంతో నిందితుడి తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన నిందితుడు విజయవాడలో కారు డ్రైవింగ్ నేర్చుకోని కోద్ది రోజులు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఇదే సమ

జూన్ 3 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణ కరోనా బులిటిన్ విడుదల  ఇవాళ 129 పాజిటివ్ కేసులు..  ఇప్పటి వరకు రాష్ట్రంలో 3020 పాజిటివ్ ఇవాళ 7 గురు మృతి ఇప్పటి వరకు రాష్ట్రంలో 99 మంది మృతి జిహెచ్ఎంసీ లో ఇవాళ 108 కేసులు నమోదు

మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్

  మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్ దాఖలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి రాయితీ ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో టిక్కెట్ల ధరలు ఖరారు చేశారని పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్ఎంఆర్ఎల్, ఎల్అండ్ టీకి హైకోర్టు నోటీసులు. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం ఇప్పటికే కొంతమంది డాక్టర్లకు కరోనా.... దాదాపు వంద మందికి కరోనా పరీక్షలు.. ఉస్మానియా  మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కారోనా. ఓ పిజి స్టూడెంట్ కి ఇటీవల పాజిటివ్ రావడం తో టెస్ట్ లు ప్రారంభించిన వైద్యులు. ఉస్మానియా హాస్టల్ లో ఉన్న మొత్తం 296 మందికి టెస్ట్ లు. ఇందులో 180 మంది యువతులు, 116 యువకులు. వారందరి పరీక్షల ఫలితాలు రేపు వచ్చే అవకాశం.

కోవిడ్19 పై ప్రజలకు అవగాహన కల్పించడం లో జర్నలిస్టుల సేవలు మారవలేమన్న హైకోర్టు

కోవిడ్19 పై ప్రజలకు అవగాహన కల్పించడం లో జర్నలిస్టుల సేవలు మారవలేమన్న హైకోర్టు కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ ధాఖలైన పిల్ పై హైకోర్టు విచారణ.. పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్నలిస్ట్ పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్ పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్... కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరిన పిటీషనర్... జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, ఉచితంగా అందించాలని కోర్టును కోరిన పిటీషనర్.. న్యాయవాదులకు 25 కోట్ల కేటాయించిన ప్రభుత్వం జర్నలిస్టులను సైతం ఆదుకోవాలన్న పిటీషనర్.. జర్నలిస్టుల పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్... రెండు వారాల్లో ప్రభుత్వం కు జర్నలిస్టుల సమస్యలపై  రెప్రజెంటేషన్ ఇవ్వాలని కోరిన

ఏపీ కరోనా 2 జూన్ బులిటెన్

ఏపి లో 3200 కి చేరుకున్న కరోన పాజీటివ్ కేసులు.గడిచిన 24 గంటల్లో 82 కేసులు నమోదు 

గన్ పార్క్ వద్ద అలజడి

గన్ పార్క్ వద్ద అలజడి అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులర్పించిన సిఎం కేసిఆర్... కేసిఆర్ కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన  ఓ యువకుడు... అరెస్టు చేసిన పోలిసులు

ఎనిమిది రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

ఎనిమిది రోజుల ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పకడ్బందీగా చేపట్టాలి;జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం లో బాగంగా కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జూన్ ఒకటి నుండి జూన్ 8 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేకk పారిశుధ్య కార్యక్రమంలో బాగంగా  పరిసరాలు,గ్రామం పరిశుభ్రతను సంతరించుకునే లా గ్రామాల్లో పారిశుధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం లో బాగంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ లు కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామంలో  పాల్గొన్నారు.ముందుగా గ్రామంలో వార్డుల వారీగా పర్యటించి ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నారు.గ్రామంలో ఉన్న డ్రైన్ లు మురుగు నీరు పోయేలా శుభ్రం చేయాలని ఆదేశించారు.మంచి నీటి ట్యాంకు లు దగ్గర బ్లీచింగ్ వేసి పరిశుభ్రం చేయాలని వారు ఆదేశించారు.మంచి నీటి ట్యాంకు లను నెలలో మూడు సార్లు శుభ్రపరచాలి అన్

మే 31 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు ఇప్పటి వరకు మొత్తం 2698 కేసులు నమోదు

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ఫేజ్‌-1 జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి ఫేజ్‌-2 పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది. వీటికి అనుమతి లేదు.. మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు. అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు. సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు,

మే 29 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈరోజు 169 కరోనా కేసులు

ఆ డాక్టర్‌పై నమ్మకం లేదు: సుధాకర్ తల్లి కావేరి భాయ్

ఆ డాక్టర్‌పై నమ్మకం లేదు: సుధాకర్ తల్లి కావేరి భాయ్ విశాఖ: తన కుమారుడు సుధాకర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ రామిరెడ్డిపై తనకు, తన కుమారుడికి నమ్మకం లేదని సుధాకర్ తల్లి కావేరి భాయ్ అన్నారు. అదే విషయం తన కొడుకు కూడా డాక్టర్‌తో చెప్పాడన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మెంటల్ లేని తన కొడుకును పిచ్చాసుపత్రిలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ అందరితో చాలా చక్కగా మాట్లాడుతున్నాడని.. అలాంటి వ్యక్తిని తీసుకువెళ్లి మెంటల్ ఆస్పత్రిలో ఎలా ఉంచుతారని ఆమె ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదని, ప్రభుత్వంపై కూడా తమకు నమ్మకం లేదని ఆమె అన్నారు. ఇవన్నీ చూస్తుంటే తన కొడుక్కు ప్రాణహాని ఉందనిపిస్తోందని కావేరి భాయ్ అనుమానం వ్యక్తం చేశారు. నిన్న నాలుగు పేజీల లెటర్ రాశారని, అలాంటి వ్యక్తిని మెంటల్ ఆస్పత్రిలో ఎందుకు ఉంచారో అర్థంకావడంలేదన్నారు. సరైన చికిత్స ఇవ్వడంలేదని ఆమె ఆరోపించారు. సరైన చికిత్స చేయపోవడంతో తన కొడుక్కి కొత్త సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతుందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. తీర్పు వచ్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం పై హైకోర్టు తీర్పు

  అమరావతి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం పై హైకోర్టు తీర్పు ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కొట్టి పారేసిన హైకోర్టు ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ కొట్టిపారేసిన హైకోర్టు  రమేశ్ కుమార్ ని  కమిషనర్ గా కొనసాగించాలని ఆదేశాలు

మే 28 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణ లో  మే 28 117 కరోనా పాజిటివ్ కేసులు.. తెలంగాణ లో 66 ఇతర రాష్ట్రాలు 2, సౌదీ నుంచి వచ్చిన వాళ్లలో 49  

నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా మొరిశెట్టి

నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా మొరిశెట్టి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గా మొరిశెట్టి నాగేశ్వర్ రావును    నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి  నియమించారు. ఈ సందర్బంగా మొరిశెట్టి మాట్లాడుతూ నా పై నమ్మకంతో నియమించిన జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి కి  మరియు  రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులకు కార్యకర్తలకు బిజెపి తన అభిమానులకు  అందరికి   ధన్యవాదాలు తెలిపారు.

కత్తులతొ సంచరిస్తున్న యువకుని అదుపులొకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు

కత్తులతొ సంచరిస్తున్న యువకుని అదుపులొకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు హైద్రబాద్ పాతబస్తి రేయిన్ బజార్ పొలిసు పరిధిలొ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తు రెండు కత్తులు వెంటపెట్టుకుని తిరుగున్న 20 సంవత్సరాల అబ్దుల్ అద్నాన్ అనే యువకుని అదుపులొకి తిసుకుని రెండు ర్యాంబొ కత్తులు స్వాధినము చేసుకుని స్థానిక రేయిన్ బజార్ పొలిసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పొలిసులు.

అమృత్ పథకం పనులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

మిర్యాలగూడ,నల్గొండ పట్టణం లో అమృత్ పథకం,దేవరకొండ పట్టణం లో మిషన్ భగీరథ పనుల పై సమీక్ష నల్గొండ,మే 27. నల్గొండ,మిర్యాలగూడ పట్టణాల లో చేపట్టిన అమృత్ పథకం కింద చేపట్టిన పనులు,దేవరకొండ అర్బన్ మిషన్ భగీరథ ఆన్యూటీ మోడ్ పనుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నల్గొండ,మిర్యాలగూడ పట్టణం లలో అమృత్ పనులు,దేవరకొండ పట్టణంలో మిషన్ భగీరథ అర్బన్ పనుల పై నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ మున్సిపల్ కమిషనర్ లు,పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల తో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశానికి శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్ భాస్కర్ రావు,రవీంద్ర కుమార్ లు హజరయ్యారు. దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ మిషన్ భగీరథ  ఆన్యూటీ మోడ్ లో పట్టణం లో చేపట్టిన పనులు అసంపూర్తి గా వున్నట్లు తెలిపారు.పట్టణం లో ఒకట వ వార్డ్ లో త్రాగు నీరు సరిగా రావటం లేదని,పనులు అసంపూర్తి గా వున్నట్లు,మార్కెట్ యార్డ్ పరిధి లో ఇండ్లకు త్రాగు నీరు రావటం లేదని, స్లూయిజ్ వాల్వ్ ఏర్పాటు చేయాలన

వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఇన్ కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్

వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఇన్ కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అమీర్‌పేట లోని వ్యభిచార గృహం పై ఎస్సార్ నగర్ పోలీసుల దాడి. ముగ్గురుయువతులతో పాటు పట్టుబడ్డ ఇన్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ భుక్య ముంబై ఎం కె రోడ్డు లోని అయకార్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న నాగేందర్

మే 26 తెలంగాణ కరోనా బులిటెన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఇవాళ  71 పాజిటివ్ కేసులు నమోదు తెలంగాణ లో ఇప్పటి వరకు 1991 కేసులు నమోదు ఇవ్వాళ కొత్తగా ఒకరు మృతి. ఇప్పటి వరకు మొత్తం 57కి చేరిన మృతుల సంఖ్య. తెలంగాణా లో 650 అక్టీవ్ కేసులు ఇవాళ 120 మంది  డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి. ఇప్పటి వరకు 1284 మంది డిశ్చార్జి ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 38 12 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి. విదేశాల నుంచి వచ్చిన వారికి 4మందికి కొరొనా పాజిటివ్ నమోదు. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చెల్ 6,-  సూర్యాపేట్, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పెట్ లో ఒక్కో కేసు నమోదు

సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  -   హై కోర్ట్

సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  -   హై కోర్ట్ సూర్యాపేట లో టెస్టులు చేయడం లేదని   బిజెవైయం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకీనేని వరుణ్ రావు వేసిన పిల్ పై విచారణ చేసి సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  అని తేల్చి చెప్పిన హై కోర్ట్. సూర్యాపేట లో టెస్టులు చేయకపోవడంపై  చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహన్ జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం మూడు గంటల పాటు  విచారణ చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం ఎమైన  ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని ప్రభుత్వం పై మండిపడ్డా కోర్ట్ లక్షణాలు ఉన్న లేకున్నా టెస్టులు చేయాల్సిందే ఏప్రిల్ 24 తర్వాత కేవలం 35 టెస్టులు మాత్రమే చేసి రెడ్ జోన్ నుండి గ్రీన్ జోన్ గా మార్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం అడుతారా అని తీవ్రంగా సీరియస్ అయిన కోర్ట్  సూర్యాపేటతో పాటు తెలంగాణ అంతటా టెస్టులు నిర్వహించి జాతీయ సగటును అందుకోవాలని ఆర్డర్   వలస కార్మికుల కోసం తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించిన  కోర్ట్

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి - దర్యాప్తు చేపట్టిన పోలీసులు

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి    LB నగర్ లోని సాగర్ రింగ్ రోడ్ లోని అలేఖ్య టవర్స్ లో 14 వ అంతస్తు లో నివసిస్తున్న రఘురాం పద్మ కూతురు సాహితీ ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (BDS) నాలుగో సంవత్సరం చదువుతున్న సాహితీ ఈరోజు మధ్యాహ్నం సమయంలో తన నివాసంలోనే 14 వ అంతస్తు నుండి బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుండి దూకి ఆత్మహత్య   సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు...

మే 21 తెలంగాణ కరోనా బులిటెన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ ఇవాళ రాష్ట్రంలో   38 పాజిటివ్ కేసులు నమోదు ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం.  కేసులు నమోదు 1699 కరోనా తో ఇవాళ   5 మృతి ఇప్పటి వరకు మొత్తం 45 మంది మృతి తెలంగాణా లో అక్టీవ్ కేసులు 618 ఇవాళ 23  డిశ్చార్జి ఇప్పటి వరకు  1036 మంది డిశ్చార్జి ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 26  పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి..10 రంగారెడ్డి 2 ఇప్పటి వరకు రాష్ట్రంలో  99 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు కరోనా  

రైతులకు సలహాలు,సూచనలు  అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర -  నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

రైతులకు సలహాలు,సూచనలు  అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర -  నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ వ్యవసాయ రంగంలో వస్తున్న వస్తున్న మార్పులు,లాభసాటి వ్యవసాయ సాగుకు క్షేత్ర స్థాయిలో రైతులకు సలహాలు,సూచనలు  అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని  నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏ.ఈ. ఓ.లు) వ్యక్తిత్వ వికాస శిక్షణ,ఒత్తిడి అధిగమించడం పై  నిర్వహించిన  శిక్షణ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ది కి,రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయ విస్తరణ అధికారులు నియామకం జరిగినప్పటి నుండి ఎటువంటి వ్యక్తిత్వ వికాస శిక్షణ, స్ట్రెస్ మేనేజ్ మెంట్ పై శిక్షణ నివ్వలేదని,రానున్న రోజుల్లో వ్యవసాయ అధికారుల పై మరింత ఒత్తిడి వుంటుందని, ఈ శిక్షణ ద్వారా ఉద్యోగ పరంగా ఒత్తి

గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు పని కల్పించడం లో నిర్లక్ష్యం వహించవద్దు - జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్గొండ,మే 20..మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు పని కల్పించడం లో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.ఉపాధి హామీ కింద పని కోరిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎం.పి.డి. ఓ.లు, ఎం.పి. ఓ.లు,ఏ.పి. ఓ.లు,, పంచాయతీ కార్యదర్శులు,ఈ జీ ఎస్ సిబ్బంది తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పనులు,నర్సరీలు నిర్వహణ,మొక్కల సంరక్షణ తదితర అంశాలు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 844 గ్రామ పంచాయతీ ల్లో ఒక లక్షా 53 వేల 290 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వస్తున్నారని,ప్రతి జి.పి.లో సరాసరి 197 మంది హజరు అవుతున్నారని,సరాసరి ప్రతి జి.పి.లో 250 మంది వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఒక్కొక్కరికి సరాసరి 137 రూ. ల వేతనం వస్తుందని,వచ్చే వారం నాటికి సరాసరి వేతనం165  రూ.లు చెల్లించేలా పనులు కల్పించాలని సూచించారు. నర్సరీల లో మొక్కలు జి.పి.గ్రీన్ ప్లాన్ ప్రకారం పెంచాలని,పంచాయతీ కార్యదర్శులు మొక్కలు సంరక్షణ బాధ్యత వహించాలని అన్నారు.ముఖ్యంగా పండ్ల మొక్కలు పెంపకం చేపట్టాలని,జామ,ఉసిరి,బొప్

మాస్కులు దరించక పోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరిక

మాస్కులు దరించక పోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరిక మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరించారు.  కరోనా లాక్ డౌన్  మే 31వరకు పొడిగించినట్లు ప్రకటించిన కేసీఆర్.  కేబినెట్ సమావేశం అనంతరం పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచే నడుస్తాయని,  జిల్లాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్‌ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.  కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. 'హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతినిస్తున్నాం. హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులు తిరగవు. మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవు. ఆర్టీసీ బస్సులు కోవిడ్‌-19 జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు. పరిశ్రమలన్నింటికీ అనుమతి. హైదరాబాద్‌ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరవాలి.  సినిమ

గాలివాన బీభత్సనికి  ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయిన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి

గాలివాన బీభత్సనికి  ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయిన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ మండలం రాములబండ గ్రామంలో నిన్న  వచ్చిన గాలివాన బీభత్సనికి కూలిపోయిన విద్యుత్ స్తంభాలు విరిగిపడిన భారీ వృక్షాలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి  నిరాశ్రయు లైన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మరియు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి స్థానిక సర్పంచ్ రూపని జయమ్మ కార్యదర్శి సింగిల్విండో ఉపాధ్యక్షులు తవిటి కృష్ణ స్థానిక నాయకులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు

పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నాం-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నాం-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   నల్గొండ,మే 18 .రాష్ట్ర ప్రభుత్వం,వ్యవసాయ శాఖ సూచించిన విధంగా వానాకాలం లో పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.సోమవారం హైద్రాబాద్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ,రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ లు,అదనపు కలెక్టర్ లు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు,సహకార,ఉద్యాన శాఖ,రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుల తో మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వానాకాలం సీజన్ లో నియంత్రిత పద్దతిలో ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు వేయడం పై సుదీర్ఘంగా వివరించి జిల్లా కలెక్టర్ లు,రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుల తో జిల్లా పరిస్థితులు తెలుసుకొని సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ గత సంవత్సరం వానాకాలం సీజన్ లో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు,ఇందు లో 6.7లక్షలు ఎకరాలు పత్తి,3.4 లక్షల ఎకర

వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేసి గ్రామాలకు త్రాగు నీరు అందించాలి

వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేసి గ్రామాలకు త్రాగు నీరు అందించాలి జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం లో ఎం.పి.లు,శాసన సభ్యులు మిషన్ భగీరథ పనుల పై తీవ్ర అసంతృప్తి పోతిరె డ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి  3 టి.యం.సి.నీటిని డ్రా చేస్తూ జి. ఓ.203 జారీ వ్యతిరేకిస్తూ సభ ఏకగ్రీవ తీర్మానం నల్గొండ,మే 16.దక్షిణ తెలంగాణ ప్రాంతంకు ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రాంతం కు తీవ్ర అన్యాయం జరిగేలా  ఏ.పి.రాష్ట్రం పోతి రెడ్డి పాడు రెగ్యులేటర్ నుండి అక్రమంగా జి. ఓ 203 జారీ చేసి 3 టి.యం.సి నీటిని డ్రా చేయడం పట్ల వ్యతిరేకిస్తూ  జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం లో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ తీర్మానం చేశారు.శని వారం జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించి పంచాయతీ రాజ్,కరోనా నియంత్రణ చర్యలు, మిషన్ భగీరథ పనులు తదితర అంశాల పై సమీక్షించారు.సభ ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య మాట్లాడుతూ పోతిరె డ్డిపాడు నుండి అక్రమంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 3 టి.యం.సి  నీటిని తరలించడం పట్ల వ్యతిరే కిస్తూ తీర్మానం చేయాలని మాట్లాడగా హజరైన సభ్యులు బల పరుస్తూ సభలో ఏకగ్రీ

టెలి కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం

టెలి కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం    ప్రపంచమంతా కరోనా దరిమిలా  ఎక్కడి  కక్కడ  కొత్త పద్దతులతో  జీవించాల్సిన  పరిస్థితులు  వచ్చాయని , తప్ప ని పరిస్థితులలో  నూతన  పద్దతుల ను  అవలంభించడం  జరుగుతుందని మంత్రి  జగదీశ్  రెడ్డి   చెప్పారు . ఇందులో  భాగంగానే  టెలి కాన్ఫరెన్స్ ద్వారా   నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం  నిర్వహించు కోవడం  జరిగిందని  , ఇందుకు  సహకరించిన  మునిసిపల్  కౌన్సిల్  సభ్యులకు కృతజ్ఞతలు  తెలిపారు . శుక్రవారం  103 కోట్ల 14 లక్షల 65 వేల తో  2020 -21 ఆర్థిక  సంవత్సరానికి  గాను  బడ్జెట్ అంచనా , 2019 -20  సంవత్సర  సవరింపు  బడ్జెట్  అంచనా  ఆమోదానికి  గాను శుక్రవారం  కౌన్సిలర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మునిసిపల్  బడ్జెట్   సమావేశం   నిర్వహించారు .  నల్గొండ  మున్సిపల్  కార్యాలయం లోని  సమావేశ  మందిరం  నుండి  నిర్వహించిన  ఈ సమావేశానికి  ముఖ్య అతిధిగా  హాజరైన  రాష్ట్ర విద్యుత్  శాఖ మంత్రి  గుంత కండ్ల  జగదీశ్  రెడ్డి   మాట్లాడుతూ  కరోనా  నేపథ్యం లో  కొత్త  పద్దతుల  ద్వారా  ఎక్కడికక్కడ  కార్యక్రమాలు  నిర్వహించడం  జరుగుతుందని , ఇందులో  భాగంగానే   నల్గొండ

వానా కాలామ్ పంటకు ఎరువులు,విత్తనాలు అందు బాటులో ఉన్నాయి - రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి

వానా కాలామ్ పంటకు రైతులకు ఎరువులు,విత్తనాలు అందు బాటులో ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం పంటకు ఎరువులు,విత్తనాలు సరఫరా, యాసంగీ ధాన్యం కొనుగోళ్లు సమీక్షించారు.జిల్లాలో ఎరువులు రెండు లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల వానాకాలం సాగుకు అవసరం కాగా అందులో 80,000 మెట్రిక్ టన్నులు యూరియా,36,000  డి. ఏ.పి.,66,000 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు అవసరం కాగా, యూరియా,డి. ఏ.పి.,కాంప్లెక్స్ ఎరువులు 29,000 మెట్రిక్ టన్నులు అందు బాటులో వుందని వ్యవసాయ అధికారులు మంత్రికి వివరించారు. ఇందు లో 11,000 మెట్రిక్ టన్నుల యూరియా,2700 మెట్రిక్ టన్నుల డి. ఏ.పి.,13600 కాంప్లెక్స్ ఎరువులు అందు బాటులో వున్నట్లు వారు వివరించారు.ఎప్పటి కప్పుడు వచ్చిన ఎరువుల ర్యాక్ పి. ఏ.సి.ఎస్.,డీలర్ లకు పొజిషన్ చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు 1900 మెట్రిక్ టన్నులు ఎరువులు డీలర్ లు,పి. ఏ.సి.ఎస్., అగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా రైతుల కు విక్రయించి నట్లు అధికారులు

రెవెన్యూ పెండింగ్ కోర్ట్ కేసులు సమీక్షించిన జిల్లా కలెక్టర్

    రెవెన్యూ పెండింగ్ కోర్ట్ కేసులు సమీక్షించిన జిల్లా కలెక్టర్  రెవెన్యూ శాఖ కోర్ట్ కేసులకు సంబంధించి  కౌంటర్ లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.గురు వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో అర్.డి. ఓ.లు,తహశీల్దార్ లతో సమావేశం నిర్వహించి రెవెన్యూ పరంగా హైకోర్టు లో దాఖలు చేసిన పెండింగ్ కేసుల ను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, పట్టా భూములకు సంబంధించి హై కోర్ట్ లో దాఖలు చేసిన కేసుల కు సంబంధించి కౌంటర్ లు దాఖలు చేయాలని తహశీల్దార్ లు,అర్.డి. ఓ.లను కలెక్టర్ ఆదేశించారు.అదే విధంగా ప్రభుత్వ ఆదేశాల ననుసరించి నియోజక వర్గాలలో ఒక్కొక్క నియోజక వర్గంలో గోదాముల నిర్మాణం కు 15 నుండి 20 ఎకరాలు గుర్తించి నట్లు,గుర్తించిన స్థలం గోదాం ల నిర్మాణం చేయుటకు అనువుగా వున్నదా లేదా కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అర్.డి. ఓ.లు జగదీశ్వర్ రెడ్డి,(నల్గొండ),లింగ్యానాయక్,(దేవర కొండ),తహశీల్దార్ లు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్

  మిషన్ భగీరథ కింద చేపట్టిన ఇంట్రా పనులు వేగవంతం చేసి త్వరితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మిషన్ భగీరథ కింద బల్క్ వాటర్ సరఫరా, ఇంట్రా పనులు నియోజక వర్గం వారిగా పెండింగ్ పనుల పై మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారుల తో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్  భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా రక్షిత త్రాగు నీరు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన మెయిన్ గ్రిడ్ నుండి బల్క్ వాటర్ సరఫరా కు పెండింగ్ లో నున్న ఇన్ లెట్ కనెక్షన్ లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లాలో మిషన్ భగీరథ ఇంట్రా  విలేజ్ పనులు కింద 1534 ఓ.హెచ్ ఎస్.ఆర్ లకు గాను 1494 పూర్తి చేసినట్లు,40 పెండింగ్ లో నున్నట్లు మిషన్ భగీరథ అధికారులు వివరించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ ఓ.హెచ్.ఎస్.ఆర్.లు పూర్తి చేసి కనెక్షన్ లు ఇవ్వాలని అన్నారు.ఇప్పటి వరకు 4275.82 కి.మీ. లకు గాను 4119కి.మీ. పైపు లైన్ వేయడం జరిగిందని, పెండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో 355339 ఇంటింటి నల్లా కనెక్షన్ లకు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు  ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి - అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు  ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి - అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో యాసంగి  వరి ధాన్యం కొనుగోళ్ళపై ఆయన సమీక్షించారు. యాసంగి లో వరి ధాన్యం సాగు అధికంగా జరిగినందున ఇంకా వరి ధాన్యం వస్తున్13 మండలాల వ్యవసాయ అధికారులు,పౌర సరఫరా శాఖ డి. టి.లు, ఏ.పి.యం.లు,పి. ఏ.సి.ఎస్.సి.ఈ. ఓ.లతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో స్టాక్,ఇంకా ఎంత ఉంది తదితర అంశాలు సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని లు కొరత వుంటే సరఫరా చేస్తామని,ఇతర జిల్లాల మిల్లులకు ట్యాగింగ్ చేసే అవకాశం వుందని,నాణ్యతా ప్రమాణాలు,తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జె.డి.శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ   రోహిత్ సింగ్ , నల్గొండ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ,దేవర కొండ ఆర్డీఓ లింగ్యా నాయక్,  జిల్లా  పౌర సరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ నాగేశ్వర్ రావు,  జిల్లా పౌర సరఫరాల అధికారిణి రుక్మిణీదేవి.  

మావోయిస్టు నక్సల్ ఐతడు లొంగుబాటు

మావోయిస్టు నక్సల్ ఐతడు లొంగుబాటు తెలంగాణ, ములుగు: మావోయిస్టు నక్సల్ పోలీసుల ఎదుట లొంగి పోయాడు.  వెట్టి ఐతు అలియాస్ ఐతడు అనే మావోయిస్టు నేడు ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగి పోయాడు.  మావోయిస్టు నేత బడే చొక్కా రావు కు ఐతడు గన్ మెన్‌ .

రేపు ఉదయం 11 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం

రేపు ఉదయం 11 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం హాజరుకానున్నా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ , టిజెస్ అధ్యక్షుడు కోదండరాం , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ లు. సమావేశం అనంతరం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న అఖిలపక్షం నేతలు రాష్ట్రంలో లో కరోన కట్టడి విషయం లో ప్రభుత్వ నిర్ణయలు, మద్యం షాపులు తెరవడం, రైతుల దాన్యం కొనుగోలు ,  రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చేయుత తదితర అంశాలపై చర్చించనున్న అఖిలపక్షం నేతలు. కరోన నేపథ్యంలో  రాష్ట్రంలో  వలస కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలపై 12 వ తేదీన లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి కార్యాచరణ పై నిర్ణయం తీసుకోనున్న అఖిలపక్షం నాయకులు.

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల బంధువులకు భోజనం అందిస్తున్న నల్గొండ ఎన్.అర్. ఐ. ఫోరం సభ్యుల ను అభినందించిన అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల బంధువులకు భోజనం అందిస్తున్న నల్గొండ ఎన్.అర్. ఐ. ఫోరం సభ్యుల ను అభినందించిన అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి* *రాత్రి భోజనం తో పాటు,నేటి నుండి రోగుల బంధువులకు మధ్యాహ్న భోజనం అర్.డి. ఓ. చేతుల మీదుగా ప్రారంభించిన నల్గొండ ఆర్గ్( ఎన్.అర్. ఐ.ఫోరం) సభ్యులు* నల్గొండ,మే 10. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆస్పత్రి లో రోగుల బంధువులు ఇబ్బంది పడకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్.అర్. ఐ. లు సేవా దృక్పథం తో రాత్రి భోజనం తో పాటు,మధ్యాహ్నం భోజన సౌకర్యం సమ కూర్చటం పట్ల నల్గొండ అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి వారి సేవలను అభినందించారు.ఆదివారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి లో రోగుల బంధువుల ఆకలి తీర్చాలని నల్గొండ అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మధ్యాహ్న భోజనం ప్రారంభించారు.      ఎన్.అర్. ఐ. పోరం కో ఆర్డినేటర్ మిట్టపల్లి సురేష్ గుప్తా మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టి అమెరికా లో స్థిరపడిన NRI లు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి తోడ్పాటు అందించాలని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 రోజుల నుంచి రాత్రి సమయం లో భోజనం ఏర్పాటు చేసి హాస్పిటల్ కి వచ్చే రోగుల బంధువుల ఆకలిని తీర

బీజేపీ దళిత మహిళ నేతను దూషించిన ఎంఐఎం ఎమ్మెల్యే బాలాల పై కేసు నమోదు చేయాలి- బంగారు శృతి బిజెపి జాతీయ దళిత మోర్చా ఈసీ మెంబర్

బీజేపీ దళిత మహిళ నేతను దూషించిన ఎంఐఎం ఎమ్మెల్యే బాలాల పై కేసు నమోదు చేయాలి- బంగారు శృతి బిజెపి జాతీయ దళిత మోర్చా ఈసీ మెంబర్ చాదరఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ దళిత మైనర్ బాలికను ఎమ్మెల్యే బాలాల అనుచరుడు షకీల్ అత్యాచారానికి ఒడికట్టాడు. ఆ  బాలికను పరామర్శించడానికి వెళ్లిన బిజెపి జాతీయ దళిత మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బంగారు శృతిని ఎమ్మెల్యే బాలాల 'థర్డ్ క్లాస్ వాలి' అని దూషించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిజెపి దళిత నాయకులు తీవ్రంగా స్పందించారు. తనను బాలాల దూషించడంతో స్వయంగా బంగారు శృతి శనివారం చాదరఘాట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై భీమ్ అంటున్నాడు కానీ వాళ్ళ పార్టీ నాయకులు దళితులను అత్యాచారం చేస్తున్నారు మరో ఎమ్మెల్యే దూసిస్తున్నాడు ఓవైసీ మాత్రం నోరు మెదపడం లేదు ఇది అన్యాయం అన్నారు. నన్ను దూషించిన ఎమ్మెల్యే బాలాల పై పోలీసులు sc,st కేసు నమోదు చేయాలి లేకపోతే రాష్ట్రంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతాము కేంద్ర sc,st కమిషన్ దృష్టికి తీసుకెళుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భగవంత్ రావు,నర్సింహ

నర్సరీ ల లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నర్సరీ ల లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తిప్పర్తి, మా డ్గుల పల్లి,దామరచర్ల మం డలాల్లో నర్సరీలు సందర్శించిన జిల్లా కలెక్టర్ .గ్రామ పంచాయతీ ల్లో నర్సరీ ల్లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ తిప్పర్తి  మండలం రాయిని గూడెం,మా డ్గులపల్లి మండలం కొత్త గూడెం,దామరచర్ల మండలం రాజ గట్టు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలు సందర్శించారు. నర్సరీ ల్లో మొక్కల పెంపకం, జెర్మినేషన్,గ్రామ గ్రీన్ ప్లాన్,వైకుంఠ దామం,కంపోస్ట్ షెడ్ ల పనుల ప్రగతి పై మండల ,గ్రామ అధికారులతో చర్చించి ఆదేశాలు,సూచనలు జారీ చేశారు.గ్రామంలో పచ్చదనం పెంపొందించాలని,హరిత హరం కార్యక్రమం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జి.పి కి ఒక నర్సరీ ఏర్పాటు చేసిందని అన్నారు.ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు హరిత హరం పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని,గ్రామ గ్రీన్ ప్లాన్ ప్రకారం మొక్కలు పెంచుతూ మొక్కలు చని పోకుండా మొక్కలకు వాటరింగ్,చేయాలని అన్నారు.పల్లె ప్రగతి లొ గ్రామంలో తిరిగి గ్రామ ప్

విశాఖపట్నం మృతుల వివరాలు

విశాఖపట్నం మృతుల వివరాలు ఇద్దరు చిన్నారులు కూడా మృతి కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19) మృతి గంగాధర్, నారాయణమ్మ, నరసమ్మ, గంగరాజు, కృష్ణ మూర్తి మృతి మృతుడు చంద్రమౌళి ఏఎంసీలో ఎంబీబీఎస్‌ విద్యార్థి  విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య  9కి చేరిందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73)తో పాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు చంద్రమౌళి విశాఖ పట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్‌ తొలి ఏడాదిలో చేరి చదువుకుంటున్నాడు. గ్యాస్‌ లీకైన ప్రాంతాల్లో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మృతుల్లో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఏపీ సీఎం జగన్ పర్యటన అనంతరం ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.