టిజిపిసిబి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డా. డబ్ల్యూ.జి. ప్రసన్న కుమార్‌కు ఘన వీడ్కోలు


 

టిజిపిసిబి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డా. డబ్ల్యూ.జి. ప్రసన్న కుమార్‌కు ఘన వీడ్కోలు

హైదరాబాద్, జూలై 31 (గూఢచారి.పేజీ): తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి)లో సీనియర్ సోషల్ సైంటిస్ట్‌గా మూడు దశాబ్దాలకుపైగా సేవలందించిన డా. డబ్ల్యూ.జి. ప్రసన్న కుమార్ పదవీ విరమణ సందర్భంగా సంస్థ అధికారులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా టిజిపిసిబి సభ్య కార్యదర్శి  జి. రవి మాట్లాడుతూ, డా. ప్రసన్న కుమార్ పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజా భాగస్వామ్యం పెంపొందించడం, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల్లో విశేష సేవలు అందించారని కొనియాడారు. యూనిసెఫ్, యునెస్కో–జపాన్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా, గ్రీన్ అంబాసడర్‌గా, ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాల రూపకల్పన సభ్యుడిగా, ఆర్‌ఈసీ సభ్యుడిగా, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ద్వారా క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిపుణుడిగా ఆయన నిర్వహించిన బాధ్యతలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

పదవీ విరమణ అనేది సేవలకు ముగింపు కాదని, ఆయన అనుభవం, మార్గదర్శకత్వం భవిష్యత్తులో కూడా సంస్థకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అలాగే ఆయన పదవీ విరమణ జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడవాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా టిజిపిసిబి అధికారులు, సహచరులు డా. ప్రసన్న కుమార్‌తో తమ అనుభవాలను పంచుకుని ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం శాలువా, జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రఘు, ఇతర ఉన్నతాధికారులు, టిజిపిసిబి సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు