*టిజిపిసిబి లో ఘనంగా ఆషాఢ బోనాల జాతర* - అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మెంబర్ సెక్రటరీ జి. రవి

 




*టిజిపిసిబి లో ఘనంగా ఆషాఢ బోనాల జాతర*  
*అమ్మవారికి ప్రత్యేక పూజలు - రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు*

*హైదరాబాద్:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి - టీజీపీసీబీ, సనత్నగర్ కార్యాలయంలో మంగళవారం ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని రకరకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జీ. రవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.

*భక్తి ఉత్సాహంతో బోనాల ర్యాలీ*  
బోనాల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు సంప్రదాయ దుస్తుల్లో అందంగా అలంకరించిన బోనాలను తలపై ఎత్తుకుని భక్తి గీతాలు, నృత్యాలతో ర్యాలీగా వచ్చారు. ప్రత్యేకంగా కొలువైన అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. 

పూజ అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

 
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రఘు టీజీపీసీబీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ - ఓ.యు.ఎస్.ఇ.ఎ. అధ్యక్షుడు _సి. మధు గౌడ్_, ప్రధాన కార్యదర్శి _ఆర్. నవీన్ గౌడ్_, _వివేకానంద మూర్తి_, _రాజా రమేష్_, _వెంకట్ రావు_, _స్వామి_, _బాబుగౌడ్_ తదితరులు పాల్గొన్నారు.

అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

_- గుడాచారి.పేజ్_

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*