*యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత* *డిసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అరెస్టు*


 

*యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత* 

 *డిసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అరెస్టు*

 నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో గల యాదాద్రి ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. పవర్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని హామీలు ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. దీంతో శంకర్ నాయక్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*