యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం


*యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం*


యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిర్మించిన సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వారం రోజుల్లోగా ప్రారంభం కానుంది. తుది దశలో రంగులతో హంగులు దిద్దుకుంటోంది. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పం మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపొందించే లక్ష్యంతో వైటీడీఏ భూసేకరణ చేపట్టింది. 


ఈ క్రమంలోనే ఇక్కడ పటిష్ఠమైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కొండ కింద అయిదెకరాలతో పాటు రూ.6 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో 8,600 చ.అ విస్తీర్ణంలో బస్‌స్టేషన్‌ నిర్మాణమైంది. ప్రహరీ, ఇతర అవసరాలకు కోటి రూపాయలు వెచ్చించనున్నారు. ఆర్టీసీకి చెందిన డీఈ విష్ణు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. యాత్రికుల రవాణా సౌలభ్యం కోసం నిర్మితమైన ఈ బస్‌స్టేషన్‌ను వచ్చే నెల 1న ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.


 

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్