*మోదీ సభను విజయవంతం చేయండి - బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపు*
*మోదీ సభను విజయవంతం చేయండి - బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపు*
*మే 10న పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ*
*రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు*
*హైదరాబాద్:* తెలంగాణ అభివృద్ధి రథసారథి, ప్రధాని నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్‌కు విచ్చేస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేవైఎం నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తూ రూ. 7,823 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలకాలని కోరారు.
తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా కాజీపేట-విజయవాడ మూడవ రైల్వే లైన్, మహబూబ్‌నగర్ ప్రాంతంలో రూ. 3,175 కోట్ల నేషనల్ హైవే పనులు, మల్లాపూర్‌లో పెట్రోలియం టెర్మినల్ వంటి ప్రగతి కానుకలను ప్రధాని మోదీ మోసుకొస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గత 12 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం రూ. 12 లక్షల కోట్లు కేటాయించిందని, సుమారు 3.40 కోట్ల మందికి ఉచిత బియ్యం అందిస్తూ పేదవాడి ఆకలి తీరుస్తున్న ఆపద్బాంధవుడు మోదీ అని కొనియాడారు.
మే 10న మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ సభకు యువత, మేధావులు, ప్రజలు వేల సంఖ్యలో తరలిరావాలని, దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీ గర్జనను విజయవంతం చేయాలని ఐతరాజు సిద్దు విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం పార్టీ సభ కాదని, తెలంగాణ అభివృద్ధి సభ అని ఆయన స్పష్టం చేశారు.

Comments
Post a Comment